భారీ రేటు ప‌లికిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రీమేక్ హ‌క్కులు..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీమేక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను మాతృభాషలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌‌ దర్శక నిర్మాతల కన్ను టాలీవుడ్‌ సినిమాలపై పడింది. ఇటీవల తెలుగులో సూపర్ హిట్ అయి, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇక యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన‌..

భారీ రేటు ప‌లికిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' రీమేక్ హ‌క్కులు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2020 | 4:07 PM

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీమేక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. వివిధ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను మాతృభాషలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌‌ దర్శక నిర్మాతల కన్ను టాలీవుడ్‌ సినిమాలపై పడింది. ఇటీవల తెలుగులో సూపర్ హిట్ అయి, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇక యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన‌ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా కూడా బాలీవుడ్‌లో రీమేక్ కాబోతుంద‌నే వార్త‌లు ఎప్ప‌టినుంచో వ‌స్తున్నాయి. తాజాగా ఈ చిత్రం రీమేక్ హ‌క్కులు రెండు కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడుపోయాయి. అయితే బ‌డ్జెట్ క‌న్నా రెట్టింపు డ‌బ్బుల‌కు రీమేక్ హ‌క్కులు ప‌ల‌క‌డం విశేషం.

కామెడీ, థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఈ సినిమాతోనే న‌వీన్ పొలిశెట్టి హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. డిటెక్టివ్ త‌ర‌హాలో రూపు దిద్దుకున్న ఈ సినిమా.. అనుకోకుండానే మంచి హిట్ సాధించింది. కోటి రూపాయ‌ల‌తో నిర్మించిన ఈ చిత్రం.. గతేడాది జూన్ 21న విడుద‌ల‌య్యింది. కాగా ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఆరు కోట్ల వ‌సూళ్లు సాధించింది. ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన న‌వీన్‌.. ఇందులో వ‌న్ మ్యాన్ షోగా న‌టించాడు. ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతున్న‌ట్టు స‌మాచారం. కాగా ఈ సినిమాకి స్వ‌రూప్ ఆర్ ఎస్ జే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌పై రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మించారు.

Read More:

హైద‌రాబాద్ న‌గ‌రంలో కుండ‌పోత‌ వ‌ర్షం..

షిర్డీ సాయిబాబా ద‌ర్శ‌న భాగ్యం ఎప్పుడంటే?

వాట్సాప్‌లో మ‌రిన్ని సేవ‌లు.. త్వ‌ర‌లోనే పెన్ష‌న్ స‌ర్వీసులు కూడా!