భారత సంతతి నర్సుకు.. సింగపూర్ ప్రెసిడెంట్ అవార్డ్!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన 59ఏళ్ల నర్సుకు.. సింగపూర్‌లో అరుదైన గౌరవం లభించింది. భారత సంతతికి చెందిన

భారత సంతతి నర్సుకు.. సింగపూర్ ప్రెసిడెంట్ అవార్డ్!
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 7:42 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన 59ఏళ్ల నర్సుకు.. సింగపూర్‌లో అరుదైన గౌరవం లభించింది. భారత సంతతికి చెందిన కళా నారాయణసామిని.. అత్యున్నత పురస్కారంతో సింగపూర్ ప్రభుత్వం గౌరవించింది. కరోనా నేపథ్యంలో ప్రాణాలను పణంగాపెట్టి.. సేవలు అందిస్తున్న ఐదుగురు నర్సులను ప్రెసిడెంట్ అవార్డులతో సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ప్రెసిడెంట్ అవార్డు పొందిన వారిలో 59ఏళ్ల కళా నారాయణసామి ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మరోవైపు.. వుడ్ ల్యాండ్ హెల్త్ క్యాంపస్‌లో నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న నారాయణసామికి ఇన్ఫెక్షన్ కంట్రోల్ పద్ధతులను ఉపయోగించినందుకు అవార్డు లభించింది. 2003లో సార్స్ విజృంభించినప్పుడు ఇన్ఫెక్షన్‌ను కంట్రోల్ చేసే పద్ధతులను ఆమె నేర్చుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆ పద్ధతులను ఉపయోగించి కళా నారాయణసామి సేవలందిస్తున్నారు. దీంతో ఆమె సేవలను గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం.. ప్రెసిడెంట్ అవార్డుతో సత్కరించింది. ఇందులో భాగంగా సింగపూర్ ప్రెసిడెంట్ సంతకం చేసిన ప్రశంసా పత్రం, ట్రోఫీ, 7,228 డాలర్లను.. సింగపూర్ ప్రభుత్వం కళా నారాయణసామికి అందించింది.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..