AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cloudburst: పోటెత్తిన వరదలు.. కుప్పకూలిన ఇళ్లు.. ముగ్గురు మృతి, నలుగురు గల్లంతు..

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమవారం తెల్లవారుజామున ఆకస్మిక

Cloudburst: పోటెత్తిన వరదలు.. కుప్పకూలిన ఇళ్లు.. ముగ్గురు మృతి, నలుగురు గల్లంతు..
Cloudburst In Mando Village
Shaik Madar Saheb
|

Updated on: Jul 19, 2021 | 8:27 AM

Share

Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమవారం తెల్లవారుజామున ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లా మండో గ్రామంలో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో జిల్లాలోని ఇళ్లు కుప్ప కూలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆకస్మిక వరదల్లో ఓ ఇల్లు కుప్ప కూలి మాధురి(42), రీతూ(38), ఇషూ (6) మరణించగా.. మరో నలుగురు కుటుంబసభ్యులు గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న ఉత్తరకాశీ జిల్లా అధికారులు, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వరదల అనంతరం సహాయ పునరావాస పనులు చేపట్టామని, గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్డీఆర్ఎఫ్ ఇన్‌చార్జ్ జగదాంబ ప్రసాద్ పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా చాలా ఇళ్లు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు.

Also Read:

Tokyo Olympics 2021: ఆ ‘పని’ కి నో ఛాన్స్.. నిర్వాహకుల వింత ఆలోచనతో అథ్లెట్లు పరేషాన్!

Selfie: ‘రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. లేకపోతే నో’.. అభిమానులకు షాకిచ్చిన బీజేపీ మహిళా మంత్రి