జైలుపై కాల్పుల మోత.. 29 మంది, 50 మందికి గాయాలు

తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఒక జైలుపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో దాదాపు 29 మంది మృత్యువాతపడ్డారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు గంటసేపు కాల్పుల మోతతో జైలు ప్రాంగణం దద్దరిల్లింది.

జైలుపై కాల్పుల మోత.. 29 మంది, 50 మందికి గాయాలు
Balaraju Goud

|

Aug 03, 2020 | 11:14 PM

తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఒక జైలుపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో దాదాపు 29 మంది మృత్యువాతపడ్డారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు గంటసేపు కాల్పుల మోతతో జైలు ప్రాంగణం దద్దరిల్లింది.

నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సిటీలోని ప్రాదేశిక గవర్నర్ కార్యాలయానికి సమీపంలో భారీ భద్రత ఉన్న సెంట్రల్ జైలుతోపాటు సమీప నివాస భవనాలపై కూడా కాల్పులు జరిగాయి. భద్రతా దళాలు జైలు గుండా వెళ్తుండగా ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దళంకు చెందిన టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వచ్చిన దుండగులు జైలు ప్రధాన ద్వారం వద్ద బాంబులను పేల్చారు. అనంతరం చుట్టూ పక్కల ప్రాంతాలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 29 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో పౌరులు, ఖైదీలు, గార్డులు, ఆఫ్ఘన్ భద్రతా దళాలు ఉన్నట్లు ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అట్టౌల్లా ఖోగ్యాని తెలిపారు.

అయితే, అక్కడి జైలులో ప్రస్తుతం 1,500 మంది ఖైదీలు ఉంటున్నారు. కాగా, కొందరు కాల్పుల సమయంలో తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. కాబూల్‌కు తూర్పున 115 కిలోమీటర్ల దూరంలోని నంగర్‌హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం భద్రతా దళాలు జైలును స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్ తెలిపారు. అమెరికా, నాటో దళాలు తాలిబాన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu