“బాటిల్ కేప్ ఛాలెంజ్‌”పై రష్మీ కామెంట్స్

తన చూపులతో రెచ్చగొచ్చే రష్మీ గౌతమ్.. తన మాటలతో కూడా ఆలోచింపజేస్తుంది. తాజాగా రష్మీ ఓ పోస్టు పెట్టింది. తాజాగా సోషల్ మీడియాకు కుదిపేస్తున్న బాటిల్ కేప్ ఛాలెంజ్ గురించి చెప్పాల్సి పనిలేదు. ఒక బాటిల్‌ను ముందు పెట్టుకుని కాళ్లతో ఆమూతను ఓపెన్ చేయాలి.. ఇదీ బాటిల్ కేప్ ఛాలెంజ్ అంటే. అయితే దీన్ని ఒకరినుంచి మరొకరు విసురుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై రష్మీకి చిర్రెత్తుకొచ్చింది. ఇలాంటివన్నీ పనీపాట లేనివాళ్లు చేసే పనులంటూ ఆగ్రహించింది. సెలబ్రిటీస్ పేరు […]

బాటిల్ కేప్ ఛాలెంజ్‌పై  రష్మీ కామెంట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 04, 2019 | 9:41 PM

తన చూపులతో రెచ్చగొచ్చే రష్మీ గౌతమ్.. తన మాటలతో కూడా ఆలోచింపజేస్తుంది. తాజాగా రష్మీ ఓ పోస్టు పెట్టింది. తాజాగా సోషల్ మీడియాకు కుదిపేస్తున్న బాటిల్ కేప్ ఛాలెంజ్ గురించి చెప్పాల్సి పనిలేదు. ఒక బాటిల్‌ను ముందు పెట్టుకుని కాళ్లతో ఆమూతను ఓపెన్ చేయాలి.. ఇదీ బాటిల్ కేప్ ఛాలెంజ్ అంటే. అయితే దీన్ని ఒకరినుంచి మరొకరు విసురుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై రష్మీకి చిర్రెత్తుకొచ్చింది. ఇలాంటివన్నీ పనీపాట లేనివాళ్లు చేసే పనులంటూ ఆగ్రహించింది. సెలబ్రిటీస్ పేరు చెప్పుకుని ఏదో చేస్తున్నప్పుడు.. అదే సెలబ్రిటీస్ మంచి పనులు చేస్తున్నపుడు ఎందుకు చేయరంటూ అభిమానుల్ని ప్రశ్నించింది రష్మి.

అక్ష‌య్ కుమార్ స‌ర్ ప్యాడ్ మ్యాన్ అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో అమ్మాయిల ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ గురించి చెప్పాడు. మ‌రి ఈ చిత్రం చూసిన త‌ర్వాత ఎంత‌మంది మారిపోయారని ప్రశ్నిస్తూ .. మ‌న స‌మాజంలో ఉన్న బలహీనమైన అమ్మాయిలకు శానిటరీ న్యాప్కిన్లు ఎంత‌మంది కొనిస్తున్నారు? అంటూ నిలదీసింది. మొత్తానికి రష్మీ గౌతమ్ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సామాజిక బాధ్యతతో రష్మీ ఈ ట్వీట్స్ చేసిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.