ఏపీ సీఎం జగన్‌పై ..లోకేశ్ మళ్లీ ట్వీట్
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. పేదల గృహ నిర్మాణాలపై వైసీపీ నేతలు చెబుతున్న మాటలు సరికాదనే విధంగా లోకేశ్ ట్వీట్ చేశారు. “సరదాగా కొంత సమయం గడపడానికి బెంగళూరులో ప్యాలెస్ నిర్మించుకోవచ్చు..అమరావతిలో నివసించడానికి రాజ భవంతి కట్టుకోవచ్చు.. పేదవాడు మాత్రం ఎప్పుడూ కూలిపోయే ఇందిరమ్మ ఇళ్లలోనే ఉండిపోవాలి.. అంటూ సీఎం జగన్‌ను ఎద్దేవా చేశారు. మరో ట్వీట్‌లో ప్రజాధనం మింగి రాజాలా మీరు రాజ […]
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. పేదల గృహ నిర్మాణాలపై వైసీపీ నేతలు చెబుతున్న మాటలు సరికాదనే విధంగా లోకేశ్ ట్వీట్ చేశారు.
“సరదాగా కొంత సమయం గడపడానికి బెంగళూరులో ప్యాలెస్ నిర్మించుకోవచ్చు..అమరావతిలో నివసించడానికి రాజ భవంతి కట్టుకోవచ్చు.. పేదవాడు మాత్రం ఎప్పుడూ కూలిపోయే ఇందిరమ్మ ఇళ్లలోనే ఉండిపోవాలి.. అంటూ సీఎం జగన్‌ను ఎద్దేవా చేశారు. మరో ట్వీట్‌లో ప్రజాధనం మింగి రాజాలా మీరు రాజ భవనాల్లో విలాసవంతమైన జీవితం గడపొచ్చు. మీరు ఉండటానికి హైదరాబాద్‌లో పాండ్ మింగి లోటస్ లాంటి భవనాన్ని నిర్మించుకోవచ్చంటు సెటైర్ వేశారు.
ప్రస్తుతం అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎవరికి వారు టీవీ మీడియా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు సంధిస్తున్నారు.
సరదాగా కొంత సమయం గడపడానికి బెంగుళూరులో ప్యాలస్ నిర్మించుకోవచ్చు. అమరావతిలో నివాసం కోసం రాజ భవంతి కట్టుకోవచ్చు పేదవాడు మాత్రం ఎప్పుడూ కూలిపోయే ఇందిరమ్మ ఇళ్లలొనే ఉండిపోవాలి.
— Lokesh Nara (@naralokesh) July 4, 2019