Petbasheerabad blast: పేట్ బషీరాబాద్‌లో బాంబు పేలుడు కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు..!

హైదరాబాద్ మహానగరం శివారులో పేలుడు కలకలం సృష్టించింది. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని జై రామ్ నగర్ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది.

Petbasheerabad blast: పేట్ బషీరాబాద్‌లో బాంబు పేలుడు కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు..!
Follow us
Balaraju Goud

|

Updated on: May 12, 2021 | 8:44 AM

Petbasheerabad blast: హైదరాబాద్ మహానగరం శివారులో పేలుడు కలకలం సృష్టించింది. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని జై రామ్ నగర్ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ పూజా సామగ్రి దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగును విసరడంతో అది పేలిందని స్థానికులు తెలిపారు. దీంతో సుమారు కిలోమీటరు మేర భారీ శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే అతన్ని స్థానికులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. అతని చేతిలో మరో బ్యాగు ఉండడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దానిని తెరవడానికి పోలీసులు డాగ్ స్క్వాడ్ ను పిలిపించి, మరో బ్యాగును తెలిచారు. అందులో చెత్త ఉండడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

తనకు ఓ బ్యాగు బాలానగర్ పారిశ్రామిక వాడలో దొరికిందని, దాని తీసుకొస్తుండగా కుక్కలు వెంబడి పడటంతో చూసి పడేయగా అది పేలినట్లు నిందితుడు తెలుపుతున్నాడు. కాగా, పోలీసులు మాత్రం అది కెమికల్ డబ్బాగా ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…  India Corona: భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. రికార్డు స్థాయికి చేరిన మరణాల సంఖ్య..!