India Corona: భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. రికార్డు స్థాయికి చేరిన మరణాల సంఖ్య..!

దేశంలో క‌రోనా ఉగ్రరూపం కొన‌సాగుతూనే ఉంది. నిన్న కాస్త తగ్గినట్లే తగ్గిన పాజిటివ్ కేసులు మరోసారి ఎగబాకాయి. క‌రోనా యాక్టివ్‌ కేసుల్లో త‌గ్గుద‌ల క‌నిపించ‌గా, మ‌ర‌ణాల సంఖ్య మాత్రం నాలుగు వేల పైచిలుకు దాటాయి.

India Corona: భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. రికార్డు స్థాయికి చేరిన మరణాల సంఖ్య..!
Coronavirus.
Follow us
Balaraju Goud

|

Updated on: May 12, 2021 | 8:21 AM

India Coronavirus cases today: దేశంలో క‌రోనా ఉగ్రరూపం కొన‌సాగుతూనే ఉంది. నిన్న కాస్త తగ్గినట్లే తగ్గిన పాజిటివ్ కేసులు మరోసారి ఎగబాకాయి. అయితే వ‌రుస‌గా మూడో రోజూ క‌రోనా యాక్టివ్‌ కేసుల్లో త‌గ్గుద‌ల క‌నిపించ‌గా, మ‌ర‌ణాల సంఖ్య మాత్రం నాలుగు వేల పైచిలుకు దాటాయి. మార్చి మొద‌టి వారం త‌ర్వాత పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన రోజువారీ కేసులు.. క్రమంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. వ‌రుస‌గా రెండో రోజూ 3.5 ల‌క్షల‌కు లోపే న‌మోద‌య్యాయి.

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 3,48,371 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో 3.5 ల‌క్షల‌లోపు క‌రోనా కేసులు న‌మోద‌వ‌డం ఇది వ‌రుస‌గా రెండో రోజు కావ‌డం విశేషం. యాక్టివ్ కేసులు కూడా మ‌రో నాలుగు వేలు త‌గ్గడంతో 3.71 ల‌క్షల‌కు ప‌డిపోయాయి. ఈ నెల 6 అత్యధికంగా ఒకేరోజు 4,14,188 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అప్పటి నుంచి వ‌రుసగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 3,29,942 కేసులు రికార్డయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక నిన్న ఉద‌యం నుంచి ఇప్పటివ‌ర‌కు మ‌రో 4,205 మంది కరోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు. ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. గ‌త శుక్రవారం అత్యధికంగా 4,185 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు దానికంటే 20 మంది అధికంగా మృతిచెందారు. దీంతో గ‌త 14 రోజుల్లో 50 వేల మంది క‌రోనాతో క‌న్నుమూశారు. సగటున రోజుకు 3,528 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా మ‌ర‌ణాల‌తో మొత్తం మృతులు 2.5 ల‌క్షలు దాటారు.

అత్యధిక కేసులు నమోదవుతున్న మ‌హారాష్ట్రలో మ‌రోమారు మ‌ర‌ణాలు పెరిగాయి. గ‌త రెండు రోజులుగా 600 కంటే త‌క్కువ‌గా న‌మోద‌వుతుండ‌గా, ఇప్పుడ‌ది 793కు చేరింది. త‌మిళ‌నాడులో 241 నుంచి 298కి పెరిగాయి. ఇలా దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారీ మ‌ర‌ణాలు అధిక‌మ‌య్యాయి.

మొద‌టి నుంచి అత్యధిక కేసులు న‌మోద‌వుతున్న మ‌హారాష్ట్రలో రోజువారీ కేసులు త‌గ్గుతుండ‌గా, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నాయి. మిగిలిన 26 రాష్ట్రాల్లో 15 శాతం పాజిటివిటీ రేటు ఉండ‌గా, ఈ రాష్ట్రాల్లో మాత్రం 25 శాతం పాజిటివిటీ రేటు న‌మోద‌వుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read Also…  కోవిడ్ కష్టాల్లో అండగా రేణు దేశాయ్.. అవసరంలో ఉన్న వాళ్ల డీటెయిల్స్ పంపితే సాయం చేస్తా అంటూ..

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..