AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Broken Heart scene: కరోనా మహమ్మారి ధాటికి నిండు గర్భిణి బలి.. మనసును కలచివేస్తోన్న సెల్ఫీవీడియో!

కరోనా మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కంటతడి పెట్టిస్తునే ఉన్నాయి. పడకలు, ఆక్సిజన్ కొరతతో మరణిస్తున్న దయనీయ గాథలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తునే ఉన్నాయి.

Broken Heart scene: కరోనా మహమ్మారి ధాటికి నిండు గర్భిణి బలి.. మనసును కలచివేస్తోన్న సెల్ఫీవీడియో!
Husband Loses Pregnant Wife, Unborn Child Due To Covid
Balaraju Goud
|

Updated on: May 12, 2021 | 7:56 AM

Share

Husband Loses Pregnant Wife: కరోనా మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కంటతడి పెట్టిస్తునే ఉన్నాయి. పడకలు, ఆక్సిజన్ కొరతతో మరణిస్తున్న దయనీయ గాథలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తునే ఉన్నాయి. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కరోనా కారణంగా గర్భిణి మృతి చెందినట్లు ఆమె భర్త తెలిపారు. సమస్యను తెలియజేసేలా.. ఆ గర్భిణి మరణానికి 2 రోజుల క్రితం తీసుకున్న సెల్ఫీ వీడియో.. మనసును కలచివేస్తోంది.

ట్విట్టర్‌ వేదికగా షేర్ చేసిన హృదయ విదారక పోస్ట్‌ అందరిని కంటతడి పెట్టిస్తోంది. రవిష్ చావ్లా అనే వ్యక్తి నిండు గర్భిణి తన భార్య దీపిక కోవిడ్ కారణంగా మరణించినట్లు పేర్కొన్నారు. కరోనా ఎలా తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని, తేలికగా తీసుకోవలసిన విషయం గురించి మాట్లాడుతున్న వీడియోను అప్‌లోడ్ చేసింది.

వైద్యురాలు అయిన దీపికకు సంబంధించి ఈ సందేశాన్ని ఏప్రిల్ 17 న రికార్డ్ చేసి ఉంచారు. అయితే, ఏప్రిల్ 26న దీపిక కరోనా బారినపడి కన్నుమూశారు. వీడియోలో, ఆమె బలహీనత కారణంగా సరిగ్గా మాట్లాడటానికి కష్టపడుతున్నప్పటికీ, కోవిడ్‌ను తీవ్రంగా పరిగణించాలని ఆమె ప్రజలను కోరుతోంది.

ఆమె మరణం తరువాత, దీపిక భర్త రవిష్ చావ్లా మదర్స్ డే సందర్భంగా వీడియోను అప్‌లోడ్ చేశారు, “నేను నా గర్భవతి అయిన భార్యను, పుట్టబోయే బిడ్డను కోవిడ్ మహమ్మారి కారణంగా కోల్పోయాను. ఆమె ఏప్రిల్ 26న తన చివరి శ్వాసను విడిచారు. ఈ కోవిడ్‌ను తేలికగా తీసుకోవద్దని ఇతరులను హెచ్చరించింది. ” దయచేసి ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడుపులో ఉన్న బిడ్డను చూడకుండానే, తనను, మూడున్నర ఏళ్ల కొడుకును ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయిందంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రవిష్ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు.

పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీలో దీపికకు మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండిఎస్) ఉందని ఆమె భర్త రవిష్ పేర్కొన్నారు. ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పీపీఈ కిట్లను ధరించింది. డబుల్ మాస్క్ వేసుకుంది. అయినప్పటికీ ఆమెను ప్రాణాంతకమైన వైరస్ అంటుకుంది.

ఈ ఒక్క ఉదాహరణ చాలు. కోవిడ్ కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటి అనేక ఇతర సంఘటనలలో ఇది ఒకటి. కాగా ఈ సందర్బంగా చాలా మంది నెటిజన్లు ట్విట్టర్‌లో రవీష్‌కు సంతాపం తెలిపారు.

Read Also…. మనిషి తనకు తానుగా భయం, కట్టుబాట్లు, మూడ నమ్మకాల నుంచి విముక్తి పొందాలి.. నేడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి..