‘టీవీ9’ను టేకోవర్ చేసుకున్న అలందా మీడియా..నూతన సీఈఓ, సీవోవోల నియామకం

TV9ను అలందా మీడియా టేక్ ఓవర్ చేసుకుంది. కాసేపటి క్రితం సమావేశమైన ABCL డైరెక్టర్స్ బోర్డు..టీవీ9 నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ9 సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించింది. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్, సీఈవోగా పనిచేస్తున్నారు. ABCL డైరెక్టర్స్ బోర్డు ఆయనకు అదనంగా టీవీ9 ఛానల్ బాధ్యతలను అప్పజెప్పింది. అటు గొట్టిపాటి సింగారావు ప్రస్తుతం 10టీవీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయన్ను టీవీ9 సీవోవోగా నియమిస్తూ ABCL డైరెక్టర్స్ బోర్డు […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:16 pm, Fri, 10 May 19
'టీవీ9'ను టేకోవర్ చేసుకున్న అలందా మీడియా..నూతన సీఈఓ, సీవోవోల నియామకం

TV9ను అలందా మీడియా టేక్ ఓవర్ చేసుకుంది. కాసేపటి క్రితం సమావేశమైన ABCL డైరెక్టర్స్ బోర్డు..టీవీ9 నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ9 సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించింది. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్, సీఈవోగా పనిచేస్తున్నారు. ABCL డైరెక్టర్స్ బోర్డు ఆయనకు అదనంగా టీవీ9 ఛానల్ బాధ్యతలను అప్పజెప్పింది. అటు గొట్టిపాటి సింగారావు ప్రస్తుతం 10టీవీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయన్ను టీవీ9 సీవోవోగా నియమిస్తూ ABCL డైరెక్టర్స్ బోర్డు నిర్ణయం తీసుకుంది.