దూసుకొచ్చిన ఏఎన్-12.. వేటాడిన‌ ఐఏఎఫ్ ఫైట‌ర్ జెట్స్‌

భార‌తీయ వైమానిక ద‌ళానికి చెందిన ఫైట‌ర్ విమానాలు.. ఇవాళ జార్జియాకు చెందిన ఏఎన్‌-12 విమానాన్ని వెంటాడాయి. పాక్‌లోని క‌రాచీ నుంచి దారి మ‌ళ్లి ఢిల్లీ వైపు వ‌స్తున్న ఆంట‌నోవ్ ర‌వాణా విమానాన్ని ఐఏఎఫ్ విమానాలు చాక‌చ‌క్యంగా అడ్డుకున్నాయి. దారి మ‌ళ్లిన జార్జియా విమానాన్ని.. జైపూర్ విమానాశ్ర‌యంలో దిగేలా చేశారు. జార్జియా విమానం అంత‌ర్జాతీయ వైమానిక హ‌ద్దుల‌ను ఉల్లంఘించ‌డంతో.. భార‌త వైమానిక ద‌ళ ఫైట‌ర్లు దాన్ని వెంబ‌డించారు. గ‌గ‌న‌త‌ల‌ మార్గం నుంచి గ‌తి త‌ప్పిన ఆంట‌నోవ్ విమానం.. గుజ‌రాత్ […]

దూసుకొచ్చిన ఏఎన్-12.. వేటాడిన‌ ఐఏఎఫ్ ఫైట‌ర్ జెట్స్‌
TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2019 | 6:45 PM

భార‌తీయ వైమానిక ద‌ళానికి చెందిన ఫైట‌ర్ విమానాలు.. ఇవాళ జార్జియాకు చెందిన ఏఎన్‌-12 విమానాన్ని వెంటాడాయి. పాక్‌లోని క‌రాచీ నుంచి దారి మ‌ళ్లి ఢిల్లీ వైపు వ‌స్తున్న ఆంట‌నోవ్ ర‌వాణా విమానాన్ని ఐఏఎఫ్ విమానాలు చాక‌చ‌క్యంగా అడ్డుకున్నాయి. దారి మ‌ళ్లిన జార్జియా విమానాన్ని.. జైపూర్ విమానాశ్ర‌యంలో దిగేలా చేశారు. జార్జియా విమానం అంత‌ర్జాతీయ వైమానిక హ‌ద్దుల‌ను ఉల్లంఘించ‌డంతో.. భార‌త వైమానిక ద‌ళ ఫైట‌ర్లు దాన్ని వెంబ‌డించారు. గ‌గ‌న‌త‌ల‌ మార్గం నుంచి గ‌తి త‌ప్పిన ఆంట‌నోవ్ విమానం.. గుజ‌రాత్ మీదుగా దూసుకువ‌చ్చింది. అయితే స‌రిహ‌ద్దు వెంట అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉన్న భార‌త వైమానిక ద‌ళం ఆ విమానాన్ని జైపూర్‌లో ల్యాండ్ అయ్యేలా చేశారు. జార్జియా విమానంలోని పైల‌ట్‌ను, సిబ్బందిని అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu