ఆస్తులతో ఆధార్ లింక్.. మోదీ సంచలన నిర్ణయం!

విదేశీ బ్యాంకుల్లో గుట్టలుగా ఉన్న బ్లాక్ మనీని తిరిగి ఇండియాకు తీసుకొచ్చి పధకాల రూపేణా ఆ సొమ్మును పేదలకు పంచి పెడతానంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన హామీ అందరికి గుర్తున్నదే. ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు కూడా తీసుకుంటోంది. అయితే ఈ ప్రతిపాదన మీనమేషాల దశలోనే ఉండటంతో బడాబాబులకు వరంగా మారుతోంది. వాళ్ళు తమ నల్లడబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడుల రూపంలో పెట్టేశారు. దీంతో వారికి చెక్ పెట్టడానికి.. అదే సమయంలో పెరుగుతున్న […]

  • Updated On - 7:08 pm, Sun, 17 November 19
ఆస్తులతో ఆధార్ లింక్.. మోదీ సంచలన నిర్ణయం!

విదేశీ బ్యాంకుల్లో గుట్టలుగా ఉన్న బ్లాక్ మనీని తిరిగి ఇండియాకు తీసుకొచ్చి పధకాల రూపేణా ఆ సొమ్మును పేదలకు పంచి పెడతానంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన హామీ అందరికి గుర్తున్నదే. ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు కూడా తీసుకుంటోంది. అయితే ఈ ప్రతిపాదన మీనమేషాల దశలోనే ఉండటంతో బడాబాబులకు వరంగా మారుతోంది. వాళ్ళు తమ నల్లడబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడుల రూపంలో పెట్టేశారు. దీంతో వారికి చెక్ పెట్టడానికి.. అదే సమయంలో పెరుగుతున్న భూముల ధరలకు కళ్లెం వేయడానికి మోదీ సర్కార్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండియాను ఆర్ధిక సంక్షోభం పట్టి పీడిస్తున్న వేళ.. ఈ అస్త్రంతో సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి మోదీ ప్రభుత్వం పూనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దిశగా దేశంలోని మొత్తం ఆస్తులకు ఆధార్‌ లింక్ చేయాలని కేంద్రం భావిస్తోందట. దీని వల్ల బినామీల గుట్టంతా బయటపడటమే కాకుండా.. ఒకే ఆధార్‌తో ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు కొనడం అసాధ్యం కాబట్టి… రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమాలు కూడా తగ్గుతాయన్నదే మోదీ ప్లాన్.

ఇప్పటికే పెరిగిన భూముల ధరలతో మధ్యతరగతి జనాలకు సొంత ఇంటి కల.. కలగానే మిగిలిపోతోంది. కేంద్రం ఆస్తులకు ఆధార్ లింక్‌ చట్టాన్ని తీసుకొస్తే.. స్థలాల రేట్లు తగ్గి.. పేదవారికి కూడా అందుబాటులోకి వస్తాయి. మరి మోదీ సంధించే ఈ బ్రహ్మస్త్రం ఎంతవరకు పని చేస్తుందో వేచి చూడాలి.