‘ నాతో బోరిస్ ఎఫైర్..’ అమెరికన్ మహిళా పారిశ్రామికవేత్త ఆక్రోశం

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనను మానసికంగా ఎంతో వేధించారని, అవమానించారని అమెరికన్ మహిళా పారిశ్రామికవేత్త ఒకరు ఆరోపించి సంచలనం సృష్టించింది. జెన్నిఫర్ అర్క్యురీ అనే ఈమె.. చేసిన ఆరోపణలపై అప్పుడే వివాదం మొదలైంది. జాన్సన్ కి, తనకు మధ్య ఒకప్పుడు సాగిన ఎఫైర్ నేపథ్యంలో ఈ వివాదం ఆయనను చిక్కుల్లో పడేసేట్టు కనిపిస్తోంది. (బ్రిటన్ ఎన్నికల్లో మళ్ళీ ప్రధాని పదవికి పోటీ చేస్తున్న బోరిస్ జాన్సన్ ప్రచారంలో బిజీగా ఉన్నారు). ఆయన లండన్ మేయర్ గా […]

' నాతో బోరిస్ ఎఫైర్..' అమెరికన్ మహిళా పారిశ్రామికవేత్త ఆక్రోశం
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 17, 2019 | 3:59 PM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనను మానసికంగా ఎంతో వేధించారని, అవమానించారని అమెరికన్ మహిళా పారిశ్రామికవేత్త ఒకరు ఆరోపించి సంచలనం సృష్టించింది. జెన్నిఫర్ అర్క్యురీ అనే ఈమె.. చేసిన ఆరోపణలపై అప్పుడే వివాదం మొదలైంది. జాన్సన్ కి, తనకు మధ్య ఒకప్పుడు సాగిన ఎఫైర్ నేపథ్యంలో ఈ వివాదం ఆయనను చిక్కుల్లో పడేసేట్టు కనిపిస్తోంది. (బ్రిటన్ ఎన్నికల్లో మళ్ళీ ప్రధాని పదవికి పోటీ చేస్తున్న బోరిస్ జాన్సన్ ప్రచారంలో బిజీగా ఉన్నారు). ఆయన లండన్ మేయర్ గా ఉన్నప్పుడు జెన్నిఫర్.. విదేశీ వాణిజ్య లావాదేవీలలో యధేచ్చగా తలదూర్చేదట. ఆయనతో ఉన్న సంబంధమే ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. ఐటీవీ నిర్వహించిన ఎక్స్‌పోజర్ కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఇఛ్చిన జెన్నిఫర్.. తనను బోరిస్..ఒక రాత్రి వేశ్యగా.. ‘ బార్‌లో పికప్ చేసిన గర్ల్ గా ‘ పరిగణించాడని ఆరోపించింది. ఈ ‘ నిర్వాకం ‘ పై రేగిన దుమారం మీద మీ స్పందనేమిటని తాను ప్రశ్నించగా.. అసలు అలాంటిదేమీ లేదని బోరిస్ కొట్టివేశాడట.. 2008… 2016 మధ్య కాలంలో లండన్ మేయర్ గా వ్యవహరించిన బోరిస్.. ఈమెతో నాలుగేళ్లకు పైగా ఎఫైర్ నడిపాడట.. అయితే దీన్ని నిర్ధారించేందుకు ఈమె నిరాకరించింది. (ప్రస్తుతం జెన్నిఫర్ అమెరికాలో ఉంది). తమ రిలేషన్‌షిప్ బయటకు వచ్చాక.. కొంతమంది దీన్ని తోసిపుచ్చాలని, మరికొందరు ఒప్పుకోవాలని కోరారని ఆమె వెల్లడించింది. జెన్నిఫర్‌కి పబ్లిక్ మనీ కింద లక్షా 26 వేల పౌండ్లను బోరిస్ చెల్లించాడని, మేయర్ గా ఉన్న సమయంలో మూడు ఫారిన్ ట్రేడ్ మిషన్లలో ప్రవేశించేందుకు తనను అనుమతించాడని జెన్నిఫర్ పేర్కొంది. అయితే ఈమె చేసిన ఆరోపణలను బోరిస్ తోసిపుచ్చుతున్నాడు.