రోహిత్ శర్మ అసలు కోలుకున్నాడా.? లేదా.?

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన మూడు జట్లలోనూ హిట్‌మ్యాన్ పేరు లేదు. గాయం కారణంగా అతడికి విశ్రాంతి ఇస్తున్నామని.. మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు రోహిత్‌ను

  • Ravi Kiran
  • Publish Date - 1:21 pm, Tue, 27 October 20
రోహిత్ శర్మ అసలు కోలుకున్నాడా.? లేదా.?

Rohit Sharma’s injury: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన మూడు జట్లలోనూ హిట్‌మ్యాన్ పేరు లేదు. గాయం కారణంగా అతడికి విశ్రాంతి ఇస్తున్నామని.. మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు రోహిత్‌ను పర్యవేక్షిస్తుందని బీసీసీఐ ప్రకటించింది. దీనితో అతడు ఐపీఎల్‌లో తదుపరి మ్యాచ్‌ల్లో ఆడతాడా.? లేదా.? అనే సందిగ్దత నెలకొంది. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్.. నెట్స్‌లో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరి రోహిత్ శర్మ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు.. ఎందుకని ఒక్క టీమ్‌లోనూ ఎంపిక చేయలేదని అభిమానులు అడుగుతున్నారు. ఈ తరుణంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా బీసీసీఐ తీరుపై మండిపడ్డారు.

”రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ మరింత క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. కేవలం అతడి పురోగతిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదని అన్నాడు. ఇప్పటి నుంచి నెలన్నర వ్యవధి ఉన్న టెస్ట్ మ్యాచ్‌లు గురించి మాట్లాడుకుంటే.. అసలు రోహిత్ శర్మ గాయం ఎలాంటిదో క్లారిటీగా, బహిరంగంగా చెబితే.. మిగిలిన ప్లేయర్స్ సన్నద్ధం అయ్యేందుకు అవకాశం దొరుకుంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.