అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్

ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు రవిశాస్త్రి వార్నింగిచ్చాడు. చక్కగా రాణించినంత మాత్రాన అతిగా ప్రవర్తించొద్దని, జాతీయ జట్టులోకి వచ్చే దాకా ఓపికతో వుండడం మంచిదని హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చాడు రవిశాస్త్రి.

అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్
Rajesh Sharma

|

Oct 29, 2020 | 5:24 PM

Ravishastri warns suryakumar yadav: బుధవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రెచ్చిపోయిన ఆడి ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్… విజయం తర్వాత అతిగా ప్రవర్తించాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చక్కగా బ్యాటింగ్ చేసినంత మాత్రాన అలా ప్రవర్తించడం సరికాదని.. సెలెక్షన్ కమిటీ అవకాశమిచ్చే వరకు ఒద్దికగా వుండాలని కొందరతనికి సలహాలిస్తున్నారు.

బెంగళూరు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ముంబై ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్ కీలక పాత్ర పోషించాడు. 74 పరుగులతో అతనాడిన కీలక ఇన్నింగ్స్ ముంబై జట్టుకు అత్యంత కీలకమైన సమయంలో విజయాన్ని అందించింది. దాంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలబెట్టుకోవడంతోపాటు రన్ రేటులోను మెరుగుదల సాధించింది. ఇదంతా బాగానే వున్నా.. విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ విజయం సాధించిన వెంటనే చేసిన సైగలు కాస్త అతిగా అనిపించాయని క్రికెట్ అభిమానుల్లో హెచ్చ శాతం ఫీలవుతున్నారు.

ఈ నేపథ్యంలో జాతీయ జట్టులోకి సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోకపోవడంపై పలువురు సెలెక్షన్ కమిటీని కూడా తప్పుపడుతున్నారు. కానీ.. రెండ్రోజుల క్రితం ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్లను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దాదాపు అన్నీ పాత ముఖాలే వున్నా.. ఒకట్రెండు అనూహ్య సెలెక్షన్లు కూడా ఎంపికలో చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తానేంటో చాటుకునేందుకా అన్నట్లుగా బుధవారం మ్యాచ్‌లో సూర్యకుమార్ రెచ్చిపోయి ఆడాడు.

సెలెక్షన్ కమిటీకి ఛాలెంజ్ చేస్తున్నట్లుగా తాను బిహేవ్ చేయడంపై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత జట్టు చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి.. జట్టులోకి వచ్చేదాకా ఓపికతో వుండడం అవసరమని సూర్యకుమార్ యాదవ్‌కు సలహా ఇవ్వడం అందరినీ ఆకర్షిస్తోంది. త్వరలో సూర్యకుమార్‌ జాతీయ జట్టులోకి వస్తాడన్న సంకేతాల్ని రవిశాస్త్రి ఇవ్వడం విశేషం.

Also read:  చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త

Also read: ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా

Also read: నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్… కండీషన్స్ ఇవే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu