AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్చ్.. No.. No.. No.. లయన్స్.!

..1...2..0.. ఇదేం ఫోన్ నెంబర్లు కాదండీ. చెన్నై బ్యాట్స్‌మెన్‌ స్కోర్. ఐపీఎల్ 2020లో భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే మరోసారి తన పేలవ..

ప్చ్.. No.. No.. No.. లయన్స్.!
Ravi Kiran
|

Updated on: Oct 23, 2020 | 8:42 PM

Share

IPL 2020: 0..1…2..0.. ఇదేం ఫోన్ నెంబర్లు కాదండీ. చెన్నై బ్యాట్స్‌మెన్‌ స్కోర్. ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే మరోసారి తన పేలవ ఆటతీరును కనబరుస్తోంది. 50 పరుగులలోపే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ గైక్వాడ్(0), డుప్లెసిస్(1), జడేజా(7)లను బౌల్ట్ పెవిలియన్ చేర్చగా..

రాయుడు(2), జగదీషన్(0)లను బుమ్రా, ధోని(16), దీపక్ చాహర్(0) లను రాహుల్ చాహర్ ఔట్ చేశాడు. దీనితో సీఎస్‌కే 43 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కేవలం ఆల్ రౌండర్ సామ్ కరన్(21) ఒక్కడే ఓ ఎండ్ నుంచి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. అటు వరుస వికెట్లు కోల్పోవడంతో తమ జట్టేనా ఇలా అడుతున్నదని సీఎస్‌కే అభిమానులు షాక్ అవుతున్నారు. ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ అఫీషియల్ ట్విట్టర్‌లో ‘No.. No.. No..’ అని ట్వీట్ చేసింది.

Follow Us