Coronavirus India: దేశంలో పెరుగుతున్న రికవరీలు.. గత 24గంటల్లో ఎంతమంది కోలుకున్నారంటే..?

Coronavirus updates in India: తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,77,284 కి పెరగగా.. మరణాల సంఖ్య

Coronavirus India: దేశంలో పెరుగుతున్న రికవరీలు.. గత 24గంటల్లో ఎంతమంది కోలుకున్నారంటే..?
Follow us

|

Updated on: Feb 03, 2021 | 10:30 AM

Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24గంటల్లో సోమవారం 11,039 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 110 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,77,284 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,54,596 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. నిన్న కరోనా నుంచి 14,225 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,04,62,631 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,60,057 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 97.08 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,21,121 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఫిబ్రవరి 2 వరకు మొత్తం 19,84,73,178 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

Also Read:

IMD Recruitment 2021: ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. చివరితేదీ ఎప్పుడంటే ?

Aadhaar: ఇకపై ఇంటి నుంచే ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు.. హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన యూఐడీఏఐ..