Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెచ్‌డిఎఫ్‌సి డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ జారీ చేయకుండా ఆర్బీఐ తాత్కాలిక నిషేధం, అసలు ఏం జరుగుతోంది..?

దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ గత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. దీనిలో రెండేళ్లుగా పదేపదే సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

హెచ్‌డిఎఫ్‌సి డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ జారీ చేయకుండా ఆర్బీఐ తాత్కాలిక నిషేధం, అసలు ఏం జరుగుతోంది..?
Follow us
Surya Kala

|

Updated on: Feb 03, 2021 | 10:28 AM

RBI Appoints External IT: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ గత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. దీనిలో రెండేళ్లుగా పదేపదే సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐటి మౌలిక సదుపాయాలను ప్రత్యేకంగా ఆడిట్ చేసేందుకు ఓ స్వతంత్ర సంస్థని నియమించినట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వర్గాలే స్వయంగా ప్రకటించాయి. ఈ బ్యాంక్‌కి సంబంధించిన డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ జారీ చేయకుండా ఆర్బీఐ తాత్కాలిక నిషేధం విధించింది. తమ ఆడిట్ పూర్తయ్యేంతవరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.

2018 నుంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి సంబంధించిన డిజిటల్ లావాదేవీల విషయంలో కనీసం మూడుసార్లు గందరగోళం నెలకొంది. దీంతో ఆర్బీఐ ఈ విషయంపై దృష్టి సారించింది. స్వయంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ ఈ అంశంపై మాట్లాడుతూ..బ్యాంకులు ఎక్కువసార్లు ఇబ్బంది పెట్టె అంశాలపై దృష్టి పెట్టాలని .. టెక్నీకల్ అంశాలు, కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ లోపాలను సరిచేసుకోవాలని సూచించారు.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన సేవలను మరింత విస్తరించే ముందు ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్న లక్షలాది వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనదేనన్నారు. ముఖ్యంగా మనం డిజిటల్ బ్యాంకింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు. డిజిటల్ బ్యాంకింగ్‌పై ప్రజల విశ్వాసం కొనసాగించాచేలా చర్యలుండాలని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఔట్‌సైడ్ సంస్థతో ఐటీ ఆడిట్ జరుగుతోందన్నారు.

ఈ ఏడాది జనవరి 16న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీఎఫ్ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో పాటు, తమ బ్యాంక్‌లో జరిగే ఆడిట్‌కి సహకరిస్తామని ప్రకటించారు. ఇది ఒకటే కాకుండా స్వయంగా తమ బ్యాంక్ కూడా టెక్నాలజీకి సంబంధించిన అప్‌గ్రేడ్, డిజాస్టర్ సొల్యూషన్స్ విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లు ఇవి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం తీసుకుంటాయని శ్రీనివాసన్ వైద్యనాథన్, చెప్పారు

Also Read:

సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2021 ముగింపు వేడుకలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్,సీపీ సజ్జనార్.

AP Panchayat Elections: నేడు రేషన్ వాహనాలను తనిఖీ చేయనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్..