West Bengal Elections 2021: బెంగాల్‌లో కొనసాగుతున్న వలసలు.. బీజేపీలో చేరిన మరో టీఎంసీ ఎమ్మెల్యే
TMC MLA Deepak Haldar Joins BJP: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. గత కొన్ని రోజుల నుంచి అధికార పార్టీ తృణమూల్..

TMC MLA Deepak Haldar Joins BJP: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. గత కొన్ని రోజుల నుంచి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ ఎమ్మెల్యే దీపక్ హల్దార్ టీఎంసీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీకి రాజీనామా చేసిన ఒక రోజు తరువాత మంగళవారం బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. డైమండ్ హార్బర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దీపక్ హల్దార్ స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి దక్షిణ 24 పరగణాల జిల్లా బారుపూర్‌లో జరిగిన సభలో సుఖేందు అధికారి, ముకుల్ రాయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తాజాగా ఆయన చేరడంతో టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 10కి చేరింది.
Also Read:
IMD Recruitment 2021: ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. చివరితేదీ ఎప్పుడంటే ?
Aadhaar: ఇకపై ఇంటి నుంచే ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు.. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన యూఐడీఏఐ..