Rajya Sabha: ఆ చట్టాలపై చర్చించాల్సిందే.. రాజ్యసభలో సభ్యుల డిమాండ్.. ముగ్గురు ఆప్‌ ఎంపీల సస్పెన్షన్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై బుధవారం కూడా రాజ్యసభలో గందరగోళం నెలకొంది...

Rajya Sabha: ఆ చట్టాలపై చర్చించాల్సిందే.. రాజ్యసభలో సభ్యుల డిమాండ్.. ముగ్గురు ఆప్‌ ఎంపీల సస్పెన్షన్‌
Follow us

|

Updated on: Feb 03, 2021 | 11:22 AM

Rajya Sabha – 3 AAP MPs suspends: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై బుధవారం కూడా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఉదయం సభ ప్రారంభం కాగానే చట్టాలపై, రైతలు ఆందోళననపై చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కొత్త సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులు వినకపోవడంతో రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఆప్ (ఆమ్‌ ఆద్మీ పార్టీ) ఎంపీలను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు.

రైతుల ఆందోళనపై చర్చలకు సమయం కేటాయించామని.. అయినప్పటికీ నిరసన తెలపడం సరికాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నా సహనాన్ని పరీక్షిస్తే మిమ్మల్ని రోజంతా సస్పెండ్‌ చేయాల్సి ఉంటుందంటూ.. రూల్ 255 ప్రకారం ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్ సహా మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. అనంతరం ఆప్‌ ఎంపీలను సభ నుంచి బయటకు పంపించారు. దీంతో సభను కొంతసేపు వాయిదా వేశారు.

Also Read:

IMD Recruitment 2021: ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. చివరితేదీ ఎప్పుడంటే ?

Aadhaar: ఇకపై ఇంటి నుంచే ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు.. హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన యూఐడీఏఐ..