అదిరిపోయే ఈ స్కీం గురించి తెలుసా… రోజుకు రూ.10 దాచుకుంటే.. నెలకు రూ.5000 పెన్షన్.. ఎక్కడంటే..
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చాలా మంది వివిధ రకాల ప్రణాళికను వేసుకుంటుంటారు. కొంతమంది కాస్త అమౌంట్ను వేర్వేరు రూపాల్లో పెట్టుబడులు పెడుతుంటారు.
Atal Pension Yojana: ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చాలా మంది వివిధ రకాల ప్రణాళికను వేసుకుంటుంటారు. కొంతమంది కాస్త అమౌంట్ను వేర్వేరు రూపాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ సరైన పెట్టుబడి ఎక్కడా ఎలా పెట్టాలి అనేది చాలా మందికి కలిగే సందేహపడుతుంటారు. అయితే మనీ డిపాజిట్ చేయడానికి కొన్ని రకాల పెట్టుపడి ప్రణాళికను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహారణకు అటల్ పెన్షన్ యోజన (ఎపివై). దీనినే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది. ఈ పెన్షన్ ప్రణాళిక రిటైర్డ్ ఉద్యోగులు తమ నగదును ఆదా చేయడానికి సహయపడుతుంది.
చిన్న వయసులోనే ఈ పథకాన్ని ఎంచుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 60ఏళ్లు దాటిన తర్వాత ఈ పథకంలో రూ.1000, రూ.2000, రూ.3000 లేదా రూ.5000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది.
అటల్ పెన్షన్ యోజన..
ఒక వ్యక్తి 60 సంవత్సరాలు దాటిన తర్వాత రూ.1000 నుంచి రూ.5000 వేల వరకు స్థిర పెన్షన్ పొందే అవకాసం ఉంటుంది. ఇందులో పెన్షన్ మొత్తాన్ని ఒకరి వయస్సు అలాగే మరోకరి చేసే సహకారం ఆధారంగా మాత్రమే నిర్ణయించవచ్చు. ఉదాహారణుకు ఇందులో ఒక వ్యక్తి వయసు, వారు ఎంచుకున్న పెన్షన్ స్లాబ్ ఆధారంగా, విరాళాలు నెలకు రూ.42 నుంచి 1,318 వరకు మారవచ్చు. 22 ఏళ్ళ వ్యక్తి నెలవారీ రూ.1000 పెన్షన్ పొందాలనుకుంటే నెలకు రూ.59 కట్టాల్సి ఉంటుంది. నెలకు రూ.5000 పెన్షన్ కావాలనుకుంటే అతనే నెలకు రూ.292, రోజుకు రూ.10 కన్నా తక్కువ కట్టాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వయసు వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారుడు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాతే పెన్షన్ పొందేందుకు వీలుంటుంది. ఒక వేళ జీవిత భాగస్వామి లేదా నామినీ డిపాజిటల్ మరణిస్తే ఆ సమయంలో పెన్షన్ తీసుకోవచ్చు. 60 ఏళ్ళకు ముందే డిపాజిటర్ మరణిస్తే జీవిత భాగస్వామిని బట్టి ఈ పథకాన్ని బ్యాలెన్స్ కాలనికి కొనసాగించవచ్చు లేదా దానిని అక్కడితో ఆపేయవచ్చు. పీఎఫ్ఆర్డీఏ ప్రకారం డిపాజిటర్ మరణం లేదా టెర్మినల్ వ్యాధి సంబంధించిమప్పుడు మాత్రమే మధ్యలో పెట్టుబడి నుంచి తప్పుకునేందుకు వీలుంటుంది.
Also Read:
మీకు డయాబెటిస్ వచ్చిందని సందేహపడుతున్నారా ? ఈ లక్షణాలు మీలో ఉన్నాయెమో ఒకసారి చెక్ చేసుకోండి..