AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Kind Of Laptop: ఇక మీ ల్యాప్‌టాప్‌ మీ ఇష్టం.. నచ్చిన కంపెనీ పార్ట్స్‌ను రీప్లేస్‌ చేసుకోవచ్చు..

ఒక ల్యాప్‌టాప్‌లో మీకు నచ్చిన కాంపోనెంట్స్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది? ఏంటీ.. 'అది సాధ్యమయ్యేది కాదు లేండి' అని అంటారా..? కానీ...

New Kind Of Laptop: ఇక మీ ల్యాప్‌టాప్‌ మీ ఇష్టం.. నచ్చిన కంపెనీ పార్ట్స్‌ను రీప్లేస్‌ చేసుకోవచ్చు..
IT Employee
Narender Vaitla
|

Updated on: Feb 26, 2021 | 4:43 PM

Share

Frame Work Laptop: ఉదాహరణకు మీరు డెల్‌ కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తున్నారు అనుకుందాం.. అందులో ర్యామ్‌ పాడైపోయింది. అప్పుడు ఏం చేస్తారు.. డెల్‌ కంపెనీకి చెందిన ర్యామ్‌ను కొత్తది కొనుక్కొని రీప్లేస్‌ చేసుకుంటారు. దాదాపు అందరూ చేసేది ఇదే. అలా కాకుండా డెల్‌ కంపెనీ ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ కంపెనీకి చెందిన ర్యామ్‌ను బిగించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే.. హెచ్‌పీ కంపెనీ గ్రాఫిక్‌ కార్డు బాగా పనిచేస్తుందని మీరు భావిస్తుంటారు. కానీ మీరు ‘ఎసర్‌’ ల్యాప్‌ట్యాప్‌ను ఉపయోగిస్తుంటారు. అలాంటప్పుడు చేసేది ఏమిలేక.. అయితే కొత్త ల్యాప్‌ట్యాప్‌ కొంటారు.. లేదా ఉన్న గ్రాఫిక్‌ కార్డుతో సర్దుకు పోతారు. అలా కాకుండా ఒక ల్యాప్‌టాప్‌లో మీకు నచ్చిన కాంపోనెంట్స్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది? ఏంటీ.. ‘అది సాధ్యమయ్యేది కాదు లేండి’ అని అంటారా..? కానీ మీరు చదివింది నిజమే. తాజాగా మార్కెట్లోకి రాబోతోన్న కొత్త ల్యాప్‌టాప్‌ దీనిని నిజం చేయనుంది.

ఫ్రేమ్‌ వర్క్‌ అనే స్టార్టప్‌ మార్కెట్లోకి తీసుకొస్తున్న ఈ కొత్త ల్యాప్‌ట్యాప్‌లో మీకు నచ్చిన కంపెనీ పార్ట్స్‌ను అమర్చుకునే అవకాశం కల్పించారు. వినియోగదారుడుకి నచ్చిన కాంపోనెంట్‌ను మార్చుకోవచ్చు. స్క్రీన్ నుంచి మొదలు పెడితే కీ బోర్డ్‌ వరకు, ర్యామ్‌ నుంచి మొదలు చివరికి మధర్‌ బోర్డ్‌ను కూడా మార్చుకునే వెసులుబాటు కల్పించనున్నారు. దీంతో ల్యాప్‌టాప్‌లో ఏదైనా కాంపోనెంట్‌ పాడైతే అదే కంపెనీకి చెందిన కాంపోనెంట్‌ను కొనుగోలు చేయాల్సి అవసరం యూజర్‌కు ఉండదన్నమాట. ఫ్రేమ్‌ వర్క్‌ కంపెనీ ఫౌండర్‌ నిరవ్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. వినియోగదారుడు తన ల్యాప్‌టాప్‌ మరమ్మత్తులు, అప్‌గ్రేడ్‌ను చాలా సులభంగా చేసుకోవాలనేదే ఈ స్టార్టప్‌ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ‘ఒక వేళ మీ మ్యాక్‌ బుక్‌ తెర పగిలిపోతే.. లిడ్‌ అసెంబుల్ మొత్తం మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల సీఎన్‌సీ అల్యుమినియం హౌసింగ్‌, వెబ్‌ క్యామ్‌, ఫ్రంట్‌ గ్లాస్‌ లాంటి వాటినన్నింటినీ మార్చాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చు, సమయంతో కూడుకున్నది. కానీ ఫ్రేమ్‌ వర్క్‌ ల్యాప్‌టాప్‌లో మాత్రం కేవలం స్క్రీన్‌ను మార్చుకుంటే సరిపోతుందని నివర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే వేసవిలో విడుదల చేయనున్న ఈ ల్యాప్‌టాప్‌ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇక ఫ్రేమ్‌వర్క్‌ ఫౌండర్‌ నివర్‌ పాటెల్‌ ఈ స్టార్టప్‌ ప్రారంభించే కంటే ముందు ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌లో మూడేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. మరి ఎన్నో వినూత్న ఫీచర్లతో రాబోతున్న ఈ కొత్త రకం ల్యాప్‌టాప్‌ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇక ఫ్రేమ్‌ వర్క్‌ ల్యాప్‌టాప్‌ ఫీచర్ల విషయానికొస్తే..

* 1.3 కిలో బరువు * 2256*1504 స్క్రీన్‌ రిల్యూషన్. * 1080P వెబ్‌క్యామ్‌. * 55 డబ్ల్యూ హెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ. * అప్‌టూ 64 జీబీ డిడిఆర్‌4 ర్యామ్‌, 4 టీబీ హార్డ్ డిస్క్‌.

Also Read: Chenab bridge: పూర్తికావొచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన.. ఎక్కడనుకుంటున్నారు..?

Aadhaar card Fact Check: నకిలీ కార్డులతో మోసపోతున్నారా? మరేం పర్వాలేదు.. రెండే నిమిషాల్లో ఇలా చెక్ పెట్టండి..!

రెడ్‌మి ఫోన్లు వాడేవారికి గుడ్ న్యూస్.. ‘K’ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్ల విడుదల.. కళ్లు చెదిరే ఫీచర్స్.. చూశారంటే కొనాల్సిందే..