Narender Vaitla |
Updated on: Feb 27, 2021 | 10:01 AM
ఏదైనా ల్యాప్‌టాప్ పాడైతే.. సదరు కంపెనీకి చెందిన పార్ట్స్‌నే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే.
అయితే అలా అవసరం లేకుండా ఇతర కంపెనీలకు చెందిన స్పేర్‌పార్ట్స్‌ను కూడా రీప్లేస్ చేసుకునే విధంగా ఓ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు.
'ఫ్రేమ్ వర్క్' పేరుతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లో స్క్రీన్ నుంచి కీబోర్డ్ వరకు.. హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్ వరకు మీకు నచ్చిన కంపెనీ పార్ట్‌ను రీప్లేస్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.
64 జీబీ ర్యామ్, 4 టీబీ హార్డ్ డిస్క్ ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేక ఆకర్షణలు.
వచ్చే వేసవిలో విడుదల చేయనున్న ఈ ల్యాప్‌టాప్ ధరను ఇంకా నిర్ణయించలేదు.