AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World’s Dirtiest Man: ‘వరల్డ్ డర్టీ మ్యాన్’ ఇక లేడు.. 67 ఏళ్ల తర్వాత స్నానం చేశాడు.. కట్ చేస్తే..

ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా గుర్తింపు పొందిన అమౌ హాజీ 94 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. వ్యాధుల భయంతో 74 ఏళ్లపాటు స్నానం చేయకుండా..

World's Dirtiest Man: 'వరల్డ్ డర్టీ మ్యాన్' ఇక లేడు.. 67 ఏళ్ల తర్వాత స్నానం చేశాడు.. కట్ చేస్తే..
World's Dirtiest Man 2
Shiva Prajapati
|

Updated on: Oct 25, 2022 | 6:13 PM

Share

ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా గుర్తింపు పొందిన అమౌ హాజీ 94 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. వ్యాధుల భయంతో 74 ఏళ్లపాటు స్నానం చేయకుండా జీవనం సాగించిన అమౌ కు.. కొన్ని నెలల క్రితం గ్రామస్తులంతా కలిసి బలవంతంగా స్నానం చేయించినప్పటి నుంచి అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పటి నుంచి ఆరోగ్య క్రమంగా క్షీణించడంతో.. ఇవాళ తుదిశ్వాస విడిచాడు. అమౌ హాజీ మరణాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది.

అమౌ హాజీ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు..

ఇరాన్‌లోని డేగా గ్రామానికి చెందిన అమౌ హాజీ గత ఏడున్నర దశాబ్దాలుగా కనీసం ముఖం కూడా కడుక్కోలేదు. అమౌ‌కు ప్రస్తుతం 94 ఏళ్ల, అతను తన 20 సంవత్సరాల నుంచే నీటికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. స్నానం చేయమంటే ఏవో సాకులు చెబుతూ తప్పించుకునేవాడు. ఇలా 74 ఏళ్ల పాటు కనీసం ముఖం కూడా కడుక్కోకుండా జీవనం సాగించాడు. చివరకు కొన్ని నెలల క్రితం గ్రామస్తులంతా కలిసి అతనికి బలవంతంగా స్నానం చేయించారు. అప్పటి నుంచి సమస్య మొదలైంది. అమౌ అనారోగ్యం బారిన పడటం ప్రారంభమైంది. చివరకు తీవ్ర అనారోగ్యం అమౌ ప్రాణాలు కోల్పోయాడు.

స్నానం చేస్తే జబ్బులు చేస్తాయట..

తాను స్నానం చేస్తే జబ్బులు చేస్తాయని అమౌ చెబుతుండేవాడట. ఆ కారణంగా తన 20 ఏట నుంచే స్నానం చేయడం మానేశాడు. స్నానమే కాదు.. కనీసం ముఖం కూడా కడుక్కునేవాడు కాదు. నీటిని చూస్తేనే హడలిపోయేవాడు అమౌ. 7 దశాబ్దాల పాటు కనీసం ముఖం కూడా కడుక్కోపోవడంతో మొత్తం మట్టి మట్టి అయిపోయాడు అమౌ. అతని శరీరం అంతా దుమ్ము దుమ్ము ఉండేది. ఊరి చివరన చిన్న కొట్టంలో బురద ప్రాంతంలోనే జీవనం సాగించేవాడు అమౌ. పరిశుభ్రంగా ఉంటే రోగాలు వస్తాయని, అపరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసంతో.. ఇంతకాలం కనీసం నీటిని టచ్ చేయలేదు. కానీ, చివరకు గ్రామస్తులు బలవంతంగా స్నానం చేయించడంతో.. అతని భయమే నిజమైంది. రోగాల బారిన పడి కన్నుమూశాడు.

ఇవి కూడా చదవండి

విచిత్ర జీవన శైలి..

అమో జీవన శైలి చాలా విచిత్రంగా ఉండేది. అతను జంతువుల కుళ్లిన మాంసాన్ని తినడానికి ఇష్టపడేవాడు. ముఖ్యంగా శిలీంద్ర మాంసం అంటే అతనికి చాలా ఇష్టమట. అంతేకాదండోయ్.. అమోకు స్మోకింగ్ అంటే చాలా ఇష్టమ. అయితే, ఆ స్మోకింగ్ కూడా అతని జీవనశైలి లాగే విచిత్రంగా ఉంటుంది. పాత సిగార్ లాంటి పైపులో ఎండబెట్టిన జంతువుల పేడను వేసి కాల్చేవాడు. అలా కాల్చడం ద్వారా వచ్చిన పొగను ధూమపానంగా పీల్చేవాడు. ఇక చలి నుంచి రక్షణ పొందేందుకు తలకు ఒక గిన్నెలాంటి హెల్మెట్ పెట్టుకునేవాడు. తల వెంట్రుకలను, గడ్డాన్ని, శరీరంపై వెంట్రుకలను నిప్పుతో కాల్చేవాడు.

నీళ్లంటే భయమున్నా రోజూ 5 లీటర్లు..

నీళ్లంటే భయంగా ఉన్నా తుప్పు పట్టిన పెద్ద కుండలోంచి రోజూ 5 లీటర్ల నీళ్లు తాగేవాడు. భూమి సొరంగంలో గానీ, పాడుబడిన గుడిసెల్లో గానీ తలదాచుకునేవాడు. అమో కి ప్రత్యేకంగా ఇల్లు అంటూ ఏమీ లేదు. అతని పరిస్థితి చూసిన కొందరు.. చొరవ తీసుకుని మట్టి గోడతో ఒక చిన్న షెల్టర్ నిర్మించారు. ఇక కార్లకు ఉండే సైడ్ మిర్రర్‌లో తనను తాను చూసుకోవడం అంటే అమో కు చాలా ఇష్టమట.

ఆ సంఘటనలే ప్రభావం చూపాయి..

అయితే, అమో చిన్నతనంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటలను అతని జీవితంపై ప్రభావాన్ని చూపాయని అక్కడి మీడియా చెబుతోంది. ఆ ఘటనల కారణంగా మానిసికంగా గాయపడిన అమో.. తాను ఏకాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే తాను జీవించి ఉన్నంతకాలం ఒంటరిగానే ఉన్నాడు.

ప్రంపచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా..

ఇరాన్‌కు చెందిన అమౌ.. ఏళ్ల తరబడి స్నానం చేయని కారణంగా ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు.. 2013లో ఇతని జీవితం ఆధారంగా ‘ది స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హాజీ’ పేరిట చిన్న డాక్యుమెంటరీ కూడా రూపొందించారు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..