AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలో లేడీస్.. బట్టల షాపింగులో ఈ టిప్స్‌ పాటించారంటే.. ఏడాదికి రూ. 50 వేలు సేవ్ చేసుకుంటారు..!

మహిళలు తమ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులను చేసుకోవడం ద్వారా ప్రతినెల డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. అలాంటి మార్పులలో ఒకటి షాపింగ్‌. అవును, నిజంగానే ఆడవాళ్లకు కొత్త బట్టలు, చీరలు కొనుగోలు చేయటం చాలా సరదా. కానీ, షాపింగ్ చేసేటప్పుడు డబ్బు ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే, మీరు కొన్ని చిన్న చిన్న టిప్స్‌ పాటిస్తే ఖచ్చితంగా బట్టలు కొనుగోలు చేసేటప్పుడు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

హాలో లేడీస్.. బట్టల షాపింగులో ఈ టిప్స్‌ పాటించారంటే.. ఏడాదికి రూ. 50 వేలు సేవ్ చేసుకుంటారు..!
Smart Shopping Tips
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2025 | 8:40 AM

Share

సాధారణంగా మహిళలు కొత్త చీరలు, డ్రెస్‌ల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. కానీ, ఒకే డిజైన్ ఉన్న చీరలు వేర్వేరు దుకాణాలలో వేర్వేరు ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు, మీరు ఒక పెద్ద షోరూమ్ నుండి కొనుగోలు చేస్తే, దాని ధర రూ. 5 వేలు కావచ్చు. కానీ, అదే డిజైన్ చీర మరొక దుకాణంలో రూ. 2 నుండి 3 వేల వరకు దొరుకుతుంది. మీరు దానిని హోల్‌సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తే, అది ఇంకా తక్కువగా ఉండొచ్చు. సుమారు రూ. 1000 కూడా ఉండొచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు కనీసం రెండు లేదా మూడు దుకాణాలలోని ధరలను పోల్చి చూడటం మంచిది.

మహిళలు బేరసారాలు చేయడానికి వెనుకాడకూడదు. సాధారణంగా వ్యాపారులు తమ లాభాన్ని 100 శాతం వరకు నిర్ణయిస్తారు. కాబట్టి, మీరు బేరసారాలు చేస్తే మీరు ఖచ్చితంగా తక్కువ ధరకు మీకు నచ్చిన చీర లేదా డ్రెస్‌ కొనగలుగుతారు. కొన్నిసార్లు, డిస్కౌంట్ల పేరుతో, పెద్ద షాపింగ్ మాల్స్ ఎక్కువ ధరలను వసూలు చేస్తాయి. కాబట్టి, బేరసారాలు చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాల నుండి కొనుగోలు చేయడం మంచిది.

హోల్‌సేల్ మార్కెట్లలో షాపింగ్ చేయడం వల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది. ఉదాహరణకు, మహిళలు హైదరాబాద్‌లోని మదీనా మార్కెట్ వంటి ప్రదేశాలకు ఎక్కువ మంది కలిసి వెళితే హోల్‌సేల్ ధరలకు చీరలు పొందవచ్చు. పండుగల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భారీ తగ్గింపులను అందిస్తాయి. అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల సంవత్సరానికి రూ.30,000 నుండి రూ.50,000 వరకు ఆదా అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..