AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crow signs: చెడు నుంచి మంచి సంకేతాల వరకు.. కాకి శకునం గురించి మీకు తెలుసా!

భారతీయ సంస్కృతిలో పక్షులు, జంతువులకు విశేష ప్రాముఖ్యత ఉంది. వీటిలో కాకికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాకిని యముడి దూతగా, అలాగే మన పితృదేవతలకు ప్రతీకగా భావిస్తారు. కాబట్టి కాకి ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తే, భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాల గురించి సంకేతాలు లభిస్తాయని శకున శాస్త్రం చెబుతోంది. కాకి చెప్పే మంచి, చెడు శకునాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Crow signs: చెడు నుంచి మంచి సంకేతాల వరకు.. కాకి శకునం గురించి మీకు తెలుసా!
What Does A Crows Call Tell Us Good And Bad Omens
Bhavani
|

Updated on: Aug 02, 2025 | 12:10 PM

Share

మన సంస్కృతిలో కాకులకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్దలు కాకి రూపంలో మనల్ని పలకరిస్తారని నమ్ముతారు. అలాగే, కాకి చేసే శబ్దాలు, దాని ప్రవర్తన భవిష్యత్తులో జరగబోయే మంచి, చెడులను సూచిస్తుందని శకున శాస్త్రం చెబుతోంది. కాకి ఎలాంటి శకునాలను సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం.

Crow signs: చెడు నుంచి మంచి సంకేతాల వరకు.. కాకి శకునం గురించి మీకు తెలుసా భారతీయ సంస్కృతిలో పక్షులు, జంతువులకు విశేష ప్రాముఖ్యత ఉంది. వీటిలో కాకికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాకిని యముడి దూతగా, అలాగే మన పితృదేవతలకు ప్రతీకగా భావిస్తారు. కాబట్టి కాకి ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తే, భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాల గురించి సంకేతాలు లభిస్తాయని శకున శాస్త్రం చెబుతోంది. కాకి చెప్పే మంచి, చెడు శకునాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మంచి శకునాలు:

అతిథుల రాక: ఇంటి ముందు లేదా బాల్కనీలో కాకి అదేపనిగా అరుస్తుంటే, త్వరలో అతిథులు రాబోతున్నారని లేదా దూరంగా ఉన్న బంధువులు ఇంటికి వస్తారని అర్థం.

శుభ సూచన: ఇంటికి తూర్పు వైపున కాకి అరిస్తే అది శుభ శకునంగా భావించాలి. మీకు మంచి జరుగుతుందని సంకేతం.

సంతానం కలగడం: కాకి ఇంటి దగ్గర పండ్లు లేదా పువ్వులను వదిలి వెళ్తే, ఆ ఇంట్లో మగ సంతానం కలుగుతుందని నమ్మకం.

కోరికలు నెరవేరడం: కాకి ముక్కుతో తన రెక్కలు లేదా తల గోక్కుంటూ కనిపిస్తే, మీ చిరకాల కోరికలు నెరవేరబోతున్నాయని అర్థం.

పనిలో విజయం: కాకి నీళ్లు తాగుతూ కనిపిస్తే, మీరు తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయని సూచన.

ధన లాభం: ఆహారాన్ని ముక్కున కరుచుకుని వెళ్లే కాకి కనిపిస్తే, అది కూడా శుభ సూచకమే. దీనివల్ల ధన లాభం కలుగుతుంది.

చెడు శకునాలు:

అశుభం: గుంపులుగా కాకులు ఇంటి దగ్గర చేరి అరుస్తుంటే అది అశుభానికి సంకేతం. ఇంట్లో ఏదైనా చెడు జరగవచ్చని లేదా కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలగవచ్చని ఇది సూచిస్తుంది.

పితృ దోషం: ఇంటికి దక్షిణం వైపున కాకి అరిస్తే అది పితృదేవతలు కోపంగా ఉన్నారని లేదా పితృదోషం ఉందని సూచన.

మరణ సంకేతం: కాకి తల మీద తన్నడం, వాలడం లేదా తల మీదుగా ఎగిరిపోవడం అస్సలు మంచిది కాదు. ఇది ఇంట్లో ఆత్మీయుల మరణానికి ప్రతీకగా భావిస్తారు.

నష్టం: ఎండిన చెట్టు మీద కాకి అరిచినా అది కూడా చెడు శకునమే. ఇది నష్టం లేదా కీడును సూచిస్తుంది.ఈ శకునాలకు సంబంధించిన విషయాలు మన పూర్వీకుల విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం, కాకులు మరణం లేదా అశుభానికి సంకేతం ఇస్తున్నట్లు అనిపిస్తే, శివుడిని ప్రార్థించడం ద్వారా దోషాలను నివారించుకోవచ్చు.

కుజుడు, గురు అనుకూలత.. వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు..!
కుజుడు, గురు అనుకూలత.. వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?