దట్టమైన అడవుల్లో పాల ధారలా దూకుతున్న జలపాతాలు.. ఎంజాయ్ చేస్తున్న జనం

తెలంగాణ - ఛత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం బయట పడింది. కొండలపై నుండి పాల ధారలు జాలువారుతున్న ఆ జలపాతాల సందర్శకులను తెగ ఆకట్టుకుంటోంది. మంత్రముగ్ధులను చేస్తున్న ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తారు.

దట్టమైన అడవుల్లో పాల ధారలా దూకుతున్న జలపాతాలు.. ఎంజాయ్ చేస్తున్న జనం
Mahithapuram Waterfalls
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 04, 2024 | 9:49 PM

తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం బయట పడింది. కొండలపై నుండి పాల ధారలు జాలువారుతున్న ఆ జలపాతాల సందర్శకులను తెగ ఆకట్టుకుంటోంది. మంత్రముగ్ధులను చేస్తున్న ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో జలపాతాలు మరింత సందడిగా మారాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి ఆ జలపాతాలలో సందర్శకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

తెలంగాణ నయాగరా బొగత జలపాతాలకు సమీపంలో మరో జలపాతం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దట్టమైన అడవుల్లో కనువిందు చేస్తున్న ఈ జలపాతాల సందర్శనకు జనం పోటెత్తుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మహితాపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. మహితాపురం జలపాతం వద్ద పర్యాటకులతో తెగ సందడిగా మారింది. ఈ మధ్య కురిసిన వర్షాలతో జలపాతానికి జలకళను సంతరించుకుంది.

జలపాతం సుమారు 120 అడుగుల ఎత్తైన కొండలపై నుండి పాల ధారలా కిందకు దూకుతుంది. మైమరపిస్తున్న ఈ జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఎటు చూసినా కొండలు, గుట్టలు.. దట్టమైన అడవి, పచ్చని చెట్ల నడుమ, ఎత్తైన కొండలపై నుండి జాలువారుతున్న ఈ జలపాతాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

ఈ జలపాతానికి చేరుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల మేర అటవీ మార్గాన నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ జలపాతం వద్ద ఈత కొడుతూ కేరింతలతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సెలవు దినం వచ్చిందంటే చాలు ఈ జలపాతాల మరింత సందడిగా మారుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

తెలంగాణ అడవుల్లో బయటపడ్డ మరో అద్భుత జలపాతం!
తెలంగాణ అడవుల్లో బయటపడ్డ మరో అద్భుత జలపాతం!
బంగారంపై బంగారం లాంటి అవకాశం.. లోన్ తీసుకుంటే ఆ జాగ్రత్తలు మస్ట్
బంగారంపై బంగారం లాంటి అవకాశం.. లోన్ తీసుకుంటే ఆ జాగ్రత్తలు మస్ట్
బిగ్ బాస్ పేరిట జరిగే బాగోతాలు ఇవే.. ఆదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బిగ్ బాస్ పేరిట జరిగే బాగోతాలు ఇవే.. ఆదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మొబైల్ సేవల అంతరాయానికి పరిహారం.. రూల్స్‌ మార్చిన ట్రాయ్‌
మొబైల్ సేవల అంతరాయానికి పరిహారం.. రూల్స్‌ మార్చిన ట్రాయ్‌
ఎస్ఐపీ విషయంలో ఆ తప్పు చేస్తే అంతే..!
ఎస్ఐపీ విషయంలో ఆ తప్పు చేస్తే అంతే..!
విజృంభిస్తోన్న డెంగీ జ్వరాలు.. అప్రమత్తంగా ఉండాలంటోన్న వైద్యులు!
విజృంభిస్తోన్న డెంగీ జ్వరాలు.. అప్రమత్తంగా ఉండాలంటోన్న వైద్యులు!
ఈ టాటా కార్‌పై రూ.85000 తగ్గింపు.. అద్భుతమైన మైలేజ్‌..
ఈ టాటా కార్‌పై రూ.85000 తగ్గింపు.. అద్భుతమైన మైలేజ్‌..
140 ఏళ్ల చెట్టుకు రాఖీ కట్టి.. హారతి పట్టిన జనాలు..! ఎందుకంటే
140 ఏళ్ల చెట్టుకు రాఖీ కట్టి.. హారతి పట్టిన జనాలు..! ఎందుకంటే
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతుందా? పరేషానక్కర్లేదు..
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతుందా? పరేషానక్కర్లేదు..
గ్రౌండ్‌లోనే సుందర్ ను కొట్టేందుకు పరుగులు తీసిన రోహిత్.. వీడియో
గ్రౌండ్‌లోనే సుందర్ ను కొట్టేందుకు పరుగులు తీసిన రోహిత్.. వీడియో