Watch: నూజివీడు వీణల రికార్డుల మోత.. ఎందుకింత ప్రాముఖ్యతో తెలుసా?

రాయినైనా కరిగించగల శక్తి సంగీతానికి ఉందని అంటారు.. సంగీతానికి సప్త స్వరాలే ప్రాణం. అలాంటి సప్త స్వరాలు వీణ నుంచి వస్తే ఆ మాధుర్యమే వేరు. సంగీతాన్ని ఆస్వాదించడానికి ఎన్నో సాధనాలు ఉన్నా వీణ ద్వారా వచ్చే శ్రావ్యమైన సంగీతం ఎంతో ఆనందాన్ని, హాయిని ఇస్తుంది. వీణా గానం నుండి వచ్చే సప్త స్వరాల శబ్దం సంగీత ప్రియులను తన్మయత్నం పొందేలా చేస్తుంది. సరస్వతీదేవీ ఒడిలో సరిగమలను వీణ పలుకుతుంది. అలాంటి విశిష్టత కలిగిన వీణల తయారీకి నూజివీడు పెట్టింది పేరు.. ఇప్పటికే వీణల తయారీలో..

Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Nov 20, 2023 | 10:44 AM

ఏలూరు, నవంబర్‌ 20: రాయినైనా కరిగించగల శక్తి సంగీతానికి ఉందని అంటారు.. సంగీతానికి సప్త స్వరాలే ప్రాణం. అలాంటి సప్త స్వరాలు వీణ నుంచి వస్తే ఆ మాధుర్యమే వేరు. సంగీతాన్ని ఆస్వాదించడానికి ఎన్నో సాధనాలు ఉన్నా వీణ ద్వారా వచ్చే శ్రావ్యమైన సంగీతం ఎంతో ఆనందాన్ని, హాయిని ఇస్తుంది. వీణా గానం నుండి వచ్చే సప్త స్వరాల శబ్దం సంగీత ప్రియులను తన్మయత్నం పొందేలా చేస్తుంది. సరస్వతీదేవీ ఒడిలో సరిగమలను వీణ పలుకుతుంది. అలాంటి విశిష్టత కలిగిన వీణల తయారీకి నూజివీడు పెట్టింది పేరు.. ఇప్పటికే వీణల తయారీలో నూజివీడు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఎంతోమంది సంగీత కళాకారులు, రాజకీయ నాయకుల మన్ననలు ఇక్కడ వీణలు తయారీదారులు పొందారు.

నూజివీడులో ఎన్నో ఏళ్ల నుంచి వీణల తయారీ చేస్తున్నారు షేక్ మాబూ కుటుంబం. తాతల కాలం నుంచి వీణల తయారీనే వృత్తిగా చేపట్టి మాబూ కుటుంబం జీవిస్తుంది. ఆర్డర్‌ చేసిన వారికి కావాల్సిన విధంగా వీణను తయారు చేసి అందిస్తారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొందరు కళాకారులకు వీణల తయారీలోనూ ఆయన శిక్షణ ఇస్తున్నారు. అలా నూజివీడులో తయారుచేసిన వీణలకు దేశ విదేశాల్లో మంచి గుర్తింపు పొందాయి.. ప్రముఖ వ్యక్తులైన ఘంటసాల, చిట్టిబాబు, ఈమని శంకర శాస్త్రి, వీణా శ్రీవాణి, తుమరాడ సంగమేశ్వరశాస్త్రి, పప్పు సోమేశ్వరరావు, ఆదిభట్ల నారాయణదాసు నూజివీడు వీణ ద్వారా మనోహర స్వరాలు పలికించి సంగీత సరస్వతికి నీరాజనాలు అందించారు. వీణ వాయిద్య కళాకారుల ముఖ్యంగా నూజివీడు మాబూ తయారు చేసిన వీణలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. విదేశాలలో సంగీత కళాకారులకు సైతం ఇక్కడ తయారుచేసిన వీణలే వెళుతుంటాయి.

శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాచందర్, నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, ఈమని కల్యాణి, తంగిరాల ప్రణీత వంటి కళాకారులు నూజివీడు కళాకారులు తయారు చేసిన వీణలపైనే రాగాలు పలికించారు. అంతేకాక దసరా సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో సైతం సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారి ఒడిలో ఉంచేందుకు నూజివీడులో తయారు చేసిన వీణలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాంటి ప్రాముఖ్యత గల వీణల తయారీ వెనుక ఎంతో కఠోర శ్రమ, దీక్ష దాగి ఉన్నాయి. తయారీ కోసం ఉపయోగించే కలప ను ప్రత్యేకంగా తీసుకువస్తారు. ముఖ్యంగా పనస కర్రతోనే వీణలు తయారు చేస్తారు. ఎందుకంటే పనస కర్ర సుతి‌ మెత్తగా ఉండి వీణ తయారీకి అనువుగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తయారీలో ముందుగా వీణకు సంబంధించి ఒక్కొక్క విడిభాగాలను తయారుచేస్తారు. అలా విడిభాగాలు తయారు చేయడానికి సుమారు 20 రోజులు సమయం పడుతుంది. తర్వాత వాటిని కలిపి వీణగా తయారు చేసి తుది మెరుగులు దిద్దుతారు. ఒక్కో వీణ ధర సుమారు రూ. 35 వేల పైనే ఉంటుంది. వాటి సైజు అందులో ఉండే ప్రత్యేకతలను బట్టి ధర పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇళ్లల్లో, కార్యాలయాల్లో, షో కేసుల్లో అలంకరించుకునే చిన్న వీణలనూ తయారు చేస్తున్నారు. అలాగే నూజివీడులో తయారు చేసిన వీణ ఇప్పటికే లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్, భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలనూ నూజివీడు వీణ సాధించింది.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023