Fridge Tips: ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు పెడుతున్నారా.? ఈ చిట్కాలు పాటించండి..

ప్రస్తుతం ఫ్రిజ్‌ వినియోగం అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌ ఉండే రోజులు వచ్చేశాయ్‌. అయితే ఫ్రిజ్‌ను ఉపయోగించే సమయంలో తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. దీనివల్ల అందులో పెట్టే ఆహార పదార్థాలు పాడవుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఫ్రిజ్‌లో పెట్టే ఆహార పదార్థాలు పావడకుండా, తాజాగా ఉంటాయి. ఇంతకీ ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు పెట్టేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Narender Vaitla

|

Updated on: Nov 20, 2023 | 12:04 PM

పూల లాంటి సువాసన వచ్చే వస్తువులను ఫ్రిజ్‌లో నేరుగా పెట్టకూడదు. ఏదైనా ఒక కవర్‌లో జాగ్రత్తగా కవర్‌ చేసి పెట్టాలి. నేరుగా పెడితే ఫ్రిజ్‌ అంతా అదే వాసనతో నిండిపోతుంది. దీంతో ఇతర వస్తువులు సైతం అదే వాసన వస్తాయి.

1 / 5
మనలో చాలా మంది ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలను, కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెడుతుంటారు. అయితే ఫ్రిజ్‌లో గాలి ప్రసరించేలా కొంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. గాలి ఆడకపోతే పదార్థాలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గాలి ఆడేలా చేసుకోవాలి.

2 / 5
ఇక వేడి వేడిగా ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌ పెట్టకూడదు. చల్లారిన తర్వాతే వాటిని ఫ్రిజ్‌లో ఉంచాలి. డీ ఫ్రిజ్‌లో ఐస్‌ గడ్డకట్టిపోతే సుత్తెలాంటి వాటితో తొలగించకూడదు. ఫ్రిజ్‌ను కాసేపు ఆఫ్‌ చేయడం లేదా, డి ఫ్రీజ్‌ బటన్‌ను నొక్కాలి.

3 / 5
ఏవైనా వంటకాలు, పాలు, పిండి లాంటి వాటిని ఫ్రిజ్‌లో పెట్టే సమయంలో వాటిపై మూతలు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ పాత్రలపై మూతలు పెట్టకపోతే అందులోని వంటకం రుచి మారే అవకాశం ఉంటుంది.

4 / 5
ఇక కూరగాయలను కడిగిన వెంటనే, తడిగా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే పాడవకుండా ఉంటాయి. ఇక పచ్చిమిరపకాయను తొడిమె తీయకుండానే ఫ్రిజ్‌లో పెడితే తాజాగా ఉంటాయి.

5 / 5
Follow us