రోజూ ఒక యాపిల్ తింటే ఏ జబ్బులూ దరిచేరవని వైద్యులు చెబుతుంటారు. యాపిల్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది కాలేయం కొవ్వును కరిగించడానికి, కాలేయం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. పండిన బొప్పాయిలో విటమిన్లు, ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, జీర్ణ ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. బొప్పాయి జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.