Allergy Cough: ఆ సమయంలో గిన్నెడు పుల్లటి పెరుగు తింటే.. వెంటనే ఉపశమనం!

వాతావరణం చల్లగా లేదా వేడిగా ఉన్నా ఏ సమయంలోనైనా దగ్గు సంభవించవచ్చు. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు దగ్గుకు కారణమవుతాయి. హెర్బల్ టీ లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మ, తేనె కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. రుచి కోసం అందులో 2 టీస్పూన్ల తేనె కూడా కలుపుకోవచ్చు. తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే తులసి ఆకులు కొన్ని తేనెతో కలిపి నమిలినా ఫలితం ఉంటుంది..

Srilakshmi C

|

Updated on: Nov 20, 2023 | 12:01 PM

వాతావరణం చల్లగా లేదా వేడిగా ఉన్నా ఏ సమయంలోనైనా దగ్గు సంభవించవచ్చు. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు దగ్గుకు కారణమవుతాయి. హెర్బల్ టీ లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మ, తేనె కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. రుచి కోసం అందులో 2 టీస్పూన్ల తేనె కూడా కలుపుకోవచ్చు. తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే తులసి ఆకులు కొన్ని తేనెతో కలిపి నమిలినా ఫలితం ఉంటుంది.

1 / 5
ఒక గిన్నె నిండా పుల్లటి పెరుగు తిన్నా ఉపశమనం కలుగుతుంది. ఇది దగ్గును నేరుగా తగ్గించకపోయినా, వీటిల్లోని ప్రోబయోటిక్స్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా, శరీరం అన్ని రకాల బ్యాక్టీరియా లేదా వైరస్‌లతో పోరాడే శక్తిని పొందుతుంది.

2 / 5
పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ దగ్గును తగ్గిస్తుంది. ఇది గొంతులోని శ్లేష్మాన్ని ద్రవపరుస్తుంది. ఒక స్లైస్ పైనాపిల్ లేదా 3.5 ఔన్సుల పైనాపిల్ జ్యూస్ రోజుకు మూడు సార్లు తాగితే దగ్గు దూరం అవుతుంది. ఇందులో ఉండే మెంథాల్ గొంతు భారాన్ని పోగొట్టి శ్వాసను సులభతరం చేస్తుంది. వేడి నీటిలో 7-8 చుక్కల పెప్పర్‌మింట్ ఎసెన్షియల్ ఆయిల్‌తో పిప్పరమెంటు టీ తాగినా లేదా ఆవిరి పట్టించినా ఫలితం ఉంటుంది.

3 / 5
గొంతునొప్పి, దగ్గు నుంచి ఉపశమనానికి పురాతన కాలం నుంచి మార్ష్‌మల్లౌ వేర్లు, ఆకులను ఉపయోగిస్తారు. మార్ష్‌మల్లౌ రూట్ టీ లేదా క్యాప్సూల్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ మూలికలను నేరుగా పిల్లలకు వినియోగించకూడదు. వీటిని వినియోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.

4 / 5
ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ గొంతు కండరాలను రిలాక్స్ చేసి, దగ్గు, మంటను తగ్గిస్తుంది. అలాగే 2 టీస్పూన్ల వాముని నీటిలో వేసి మరిగించి తాగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 / 5
Follow us