- Telugu News Photo Gallery Cinema photos Guntur Karam to Annapurani Latest Movie Updates from Cinema Industry
Film Updates: మిర్చి యార్డ్ లో చిందేస్తున్న మహేష్.. నయన్ అన్నపూరణి నుంచి క్రేజీ అప్డేట్..
మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్నారు. సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జీబ్రా. వరుణ్‌తేజ్‌ని పెళ్లిచేసుకున్నాక తొలిసారి సోషల్ మీడియాలో స్పందించారు లావణ్య. లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న సినిమా అన్నపూరణి. సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువ.
Updated on: Nov 20, 2023 | 11:39 AM

మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం మిర్చి యార్డ్ సెట్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది గుంటూరు కారం.

సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జీబ్రా. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. యూనిక్ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

వరుణ్‌తేజ్‌ని పెళ్లిచేసుకున్నాక తొలిసారి సోషల్ మీడియాలో స్పందించారు లావణ్య. తన భర్త సరదా మనిషి అని అన్నారు. కేరింగ్‌గా ఉంటారని చెప్పారు. ఇంకా చాలా విషయాలను గమనించానని, వాటన్నటినీ తమ మధ్య పదిలంగా దాచుకుంటానని చెప్పారు లావణ్య.

నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. మహిళా సాధికారతను చాటేలా సాగుతోంది పాట. తన మనసును హత్తుకున్న కథతో అన్నపూరణి తెరకెక్కుతోందని చెప్పారు నయన్.

సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువ. ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్టు చెప్పారు రైటర్ మదన్ కర్కి. ఈ చిత్రంలో సూర్య రకరకాల భాషలు, యాసలు మాట్లాడుతారని, పీరియడ్ యాక్షన్ సినిమా తెరకెక్కుతోందని అన్నారు మదన్.




