- Telugu News Photo Gallery Cinema photos Hero Nani Hi Nanna Movie Promotions goes viral in social media Telugu Heroes Photos
Nani – Hi Nanna: దసరా సక్సెస్ ని హాయ్ నాన్న కంటిన్యూ చేస్తుందా.? నాని ప్లాన్ సూపర్.
హాయ్ నాన్న సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రాజెక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మూవీ యూనిట్ ప్రయత్నాలు ప్రారంభించేసింది. ఆల్రెడీ ఈ ఏడాది దసరా మూవీతో ఓ రేంజ్ సౌండ్‌ని ఎక్స్ పీరియన్స్ చేసిన నాని, దాన్ని మరోసారి రీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సీజన్ ఏదైనా క్యాష్ చేసుకోవడంలో ముందుంటారు నాని. ఇప్పుడైతే, ఎలక్షన్ హీట్‌ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Nov 20, 2023 | 1:29 PM

హాయ్ నాన్న సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రాజెక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మూవీ యూనిట్ ప్రయత్నాలు ప్రారంభించేసింది. ఆల్రెడీ ఈ ఏడాది దసరా మూవీతో ఓ రేంజ్ సౌండ్‌ని ఎక్స్ పీరియన్స్ చేసిన నాని, దాన్ని మరోసారి రీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

సీజన్ ఏదైనా క్యాష్ చేసుకోవడంలో ముందుంటారు నాని. ఇప్పుడైతే, ఎలక్షన్ హీట్‌ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు. రాజకీయ పద్ధతిలోనే హాయ్ నాన్న ప్రమోషన్లు చేస్తున్నారు.

2023 వేసవి స్టార్టింగ్‌లో దసరాతో సత్తా చూపించారు నాని. ఇంత మాస్ గెటప్‌లో నాని ఎలా చేస్తారో చూడాలనుకున్నవారికి కేక ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు నేచురల్ స్టార్.

ఇప్పటికీ చంకీల అంగీలేసి పాట రూరల్, టౌన్స్, సిటీస్ అనే తేడా లేకుండా మారుమోగుతోంది. ఆ రేంజ్‌లో హాయ్ నాన్న కూడా జనాల్లోకి చొచ్చుకుపోవాలన్నదే నాని కోరిక.

దసరా సక్సెస్‌ని హాయ్ నాన్నతో కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. హాయ్ నాన్నను ఆడియన్స్ కి రీచ్ చేయడం కోసం ఆదివారం జరిగే వరల్డ్ కప్‌ని కూడా యూజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు నాని.

డాటర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తున్న హాయ్ నాన్న కోసం ఆడియన్స్ మాత్రమే కాదు, నేచురల్ స్టార్ కూడా ఈగర్లీ వెయిటింగ్.





























