LifeStyle: షెడ్యూల్ సమయం కంటే ఒక గంట ముందు నిద్ర నుంచి మేల్కోవడం ఒత్తిడి నుంచి రక్షిస్తుంది

LifeStyle: వేగంగా మారుతున్న జీవనశైలి మనల్ని ఎంతో ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ ఒత్తిడితో డిప్రెషన్ లోకి జారిపోతున్నారు చాలా మంది.

LifeStyle: షెడ్యూల్ సమయం కంటే ఒక గంట ముందు నిద్ర నుంచి మేల్కోవడం ఒత్తిడి నుంచి రక్షిస్తుంది
Lifestyle
Follow us

| Edited By: KVD Varma

Updated on: Jul 14, 2021 | 7:48 AM

LifeStyle: వేగంగా మారుతున్న జీవనశైలి మనల్ని ఎంతో ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ ఒత్తిడితో డిప్రెషన్ లోకి జారిపోతున్నారు చాలా మంది. మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టే ఈ పరిస్థితిని కొన్ని పద్ధతుల ద్వారా మనం నివారించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మనం విచారం లేదా ఒత్తిడితో ఉంటే, మన షెడ్యూల్ సమయం కంటే ఒక గంట ముందే నిద్ర నుంచి మేలుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా, మనల్ని మనం మరింత ఉత్సాహంగా, రిఫ్రెష్ గా ఫీల్ అవుతామనీ, దాని ద్వారా ఒత్తిడి నుంచి బయటపడటం సులభం అవుతుందనీ వారు చెబుతున్నారు. కేవలం ఒక గంట ముందే మేల్కొనడం వల్ల డిప్రెషన్ ప్రమాదాన్ని 23 శాతం తగ్గించవచ్చని జామా సైకియాట్రీ జరిపిన పరిశోధన నిరూపించింది.

బ్రాడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ (MIT), హార్వర్డ్ పరిశోధకులు 840,000 మందిని అధ్యయనం చేశారు. దీని ఫలితాలు రాత్రి పడుకోవడం, ఉదయం లేవడం అలవాటు మానసిక ఒత్తిడి ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయని సూచిస్తున్నాయి. లాక్డౌన్ ప్రజల నిద్ర విధానాన్ని బాగా ప్రభావితం చేసింది. ఈ సందర్భంలో, ఈ అధ్యయనం ముఖ్యమైనదనిచెప్పవచ్చు.

సియు బౌల్డర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత సెలిన్ వెటర్ మాట్లాడుతూ, ‘నిద్ర సమయానికి, మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందని మాకు తెలుసు. కానీ దాని గురించి ప్రజల మనస్సులో పెద్ద ప్రశ్న ఉంది. ఉదయాన్నే నిద్రలేవడం మానసిక ఆరోగ్యానికి ఎంత మంచిది అనేదే ఆ సందేహం. ఈ అధ్యయనంలో, రాత్రికి ఒక గంట ముందు నిద్రపోవడం అలాగే, ఉదయాన్నే ఒక గంట ముందు లేవడం మాంద్యం ప్రమాదాన్ని తగ్గిస్తుందని మేము కనుగొన్నాము.” అని చెప్పారు.

2018 లో, వెయిటర్స్ 32,000 మంది నర్సులపై ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. ఇది నాలుగు సంవత్సరాలు “ప్రారంభ రైజర్స్” గా ఉన్నవారికి డిప్రెషన్ వచ్చే అవకాశం 27 శాతం వరకు తక్కువగా ఉందని తేల్చి చెప్పింది. డిప్రెషన్ కు నిద్రకు మధ్య సంబంధాన్ని ఈ పరిశోధనలు స్పష్టంగా చెప్పాయి. సాధారణంగా మధ్యాహ్నం ఒక గంట కునుకు తీయడం, రాత్రి 11 గంటలకు నిద్రకు ఉపక్రమించందం చేయడం ద్వారా డిప్రెషన్ ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతారు.

ముందుగానే లేచిన వారు దానివలన ప్రయోజనం పొందుతారా అనేది అధ్యయనం నుండి స్పష్టంగా లేదు. ఎందుకంటే, జీవ గడియారం లేదా సిర్కాడియన్ రిథమ్ వ్యక్తికి వ్యక్తికి మారుతుంది.

ఉదయం లేవడానికి ప్రతికూలతలు ఉన్నాయి, కాబట్టి శరీర గడియారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం అని పరిశోధకులు అంటున్నారు. శరీర జీవ గడియారం లేదా వారి సిర్కాడియన్ గడియారాన్ని అనుసరించడానికి వ్యక్తులను అనుమతిస్తే, అప్పుడు వారి పనితీరు మెరుగుపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఆలస్యంగా నిద్రలేవడం లేదా ఉదయాన్నే నిద్రపోయే అలవాటును మార్చాలనుకుంటే, దీని కోసం శరీర గడియారాన్ని మెరుగుపరచడం అవసరం. దీని కోసం, ఆహారం , పానీయం నుంచి వ్యాయామం, నిద్ర అదేవిధంగా మేల్కొనే సమయం వరకు ప్రతిదానికీ శ్రద్ధ వహించాలి అని వారు వివరిస్తున్నారు.

ఉదయాన్నే నిద్రలేవడం వలన మూడ్ ప్రాభావితం అవుతుంది. మరింత కాంతి స్పందన పొందటానికి ఇది అవకాశాన్నిస్తుంది. దీనివలన హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. దీని ప్రభావం మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.

Also Read: విటమిన్ B12 లోపం ఉందా ?.. అయితే ఈ వ్యాధులు చుట్టుముట్టినట్లే.. ఎలాంటి ఆహారంతో ఎదుర్కోవాలంటే?

Dream : ఆకాశం నుంచి కిందపడుతున్నట్లుగా కలగంటున్నారా..! అయితే భవిష్యత్‌లో వీటిని ఎదుర్కోక తప్పదు..