Salman Khan: వామ్మో.. సల్మాన్ వాచ్ అమ్మితే లైఫ్ సెట్టు.. కేవలం 18 మంది వద్ద మాత్రమే ఉందట..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాయ్ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. కొన్ని నెలలుగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా.. తాజాగా సల్మాన్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న సల్మాన్ ప్రస్తుతం సికిందర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈనెల 27న సల్మాన్ ఖాన్ 59వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాదిలాగే ఈసారి సైతం తన సన్నిహితుల కోసం స్పెషల్ బర్త్ డే పార్టీ నిర్వహించాడు సల్మాన్. అలాగే సల్మాన్ కోసం అనంత్ అంబానీ పార్టీని ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ ప్రత్యేక పార్టీ జరిగింది. ఈ క్రమంలో సల్మాన్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
అందులో సల్మాన్ ధరించిన డైమండ్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే డైమండ్ వాచ్‌ని అనంత్ అంబానీ పెళ్లిలో సల్మాన్ ఖాన్ కూడా ధరించాడు.కొన్ని నెలల క్రితం అమెరికన్ లగ్జరీ వాచ్, జ్యువెలరీ బ్రాండ్ జాకర్ & కంపెనీ యజమాని జాకబ్ అర్బో తన ‘బిలియనీర్ III’ అనే లగ్జరీ వాచ్‌ను సల్మాన్ ఖాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఈ వాచ్ 714 తెల్లని వజ్రాలతో నిండి ఉంది. సల్మాన్‌ఖాన్ ధరించిన డైమండ్ వాచ్‌ను “జాకోబారాబో” అనే సంస్థ తయారు చేసింది. ఈ వాచ్ ప్రపంచంలో కేవలం 18 మంది మాత్రమే కలిగి ఉన్నారు.
ఈ వాచ్ ధర 7.7 మిలియన్లు అంటే 65 కోట్ల రూపాయలు. ఇంత ఖరీదైన వాచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. క్రిస్టియానో రొనాల్డోతో సహా చాలా మంది ప్రముఖులు జాకబ్ అర్బో బిలియనీర్ IIIని ధరిస్తారు. ఈ వాచ్‌లో 152 వైట్ కట్ డైమండ్స్, 76 డైమండ్‌లు ఉన్నాయి. ఈ వాచ్ బ్రాస్‌లెట్‌లో 504 వైట్ కట్ డైమండ్స్ ఉన్నాయి. మడోన్నా, రిహన్నా, క్రిస్టియానో రొనాల్డో వంటి అంతర్జాతీయ ప్రముఖులు జాకబ్ అర్బో వాచీలు, నగలు ధరిస్తారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.