AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాష్ట్ర చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిపోనున్న అమరావతి నిర్మాణం.. దశ మారనున్న అమరావతి..!

అమరావతి పరుగులు పెడుతోందిప్పుడు. ఏకంగా 60వేల కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని పనులు మొదలయ్యాయి. జస్ట్‌.. మూడంటే మూడే ఏళ్లలో క్యాపిటల్‌ సిటీకి ఓ రూపురాబోతోంది. రీసెంట్‌గా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ప్రధాని మోదీతో చర్చించిన మేజర్‌ టాపిక్స్‌లో అమరావతి కూడా ఒకటి. తాజాగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన ఈ-టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.

Andhra Pradesh: రాష్ట్ర చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిపోనున్న అమరావతి నిర్మాణం.. దశ మారనున్న అమరావతి..!
Amaravati
Balaraju Goud
|

Updated on: Jan 01, 2025 | 12:04 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణకు ప్రతిష్ఠాత్మకంగా ముందడుగు వేస్తోంది. నూతన సంవత్సర రిజల్యూషన్‌గా భావిస్తూ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ADB) నిధుల సహకారంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన ఈ-టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. సీఆర్‌డీఏ (కాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

ఇప్పటికే హ్యాపీ నెస్ట్ నిర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ – సీఆర్డీఏ రూ. 818 కోట్ల అంచనా వ్యయంతో గత డిసెంబర్ నెలలో టెండర్లు పిలిచింది. సీఆర్డీఏ చేపట్టనున్న ఈ గృహనిర్మాణ ప్రాజెక్టులో జీ+18 విధానంలో 12 టవర్లు నిర్మిస్తారు. మొత్తం 1,200 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం నిర్మాణ ప్రాంతం 20,89,260 స్క్వేర్ ఫీట్. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నేలపాడు 2018లో ప్రారంభించాలని ప్రకటించగా, చాలా మంది ఆ ప్లాట్ల కోసం బుకింగ్ కూడా చేసుకున్నారు. ఇంకా పలు ప్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నట్టు తాజాగా ప్రకటించింది CRDA.

*తాజాగా విడుదల చేసిన టెండర్లలో ప్రధాన ప్రాజెక్టుల వివరాలు*

1. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు

మొత్తం రూ.1,206 కోట్లు వ్యయంతో ప్రధాన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు. జోన్ 5బీ పరిధిలో రూ. 603 కోట్లతో రహదారులు, డ్రెయిన్లు, మంచినీటి సరఫరా, సీవరేజీ వ్యవస్థ, డక్ట్స్, ప్లాంటేషన్ పనులు చేపడతారు. ఈ పనులు తుళ్లూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రాయపూడి గ్రామాలను కవర్ చేస్తాయి.

2. వరదనీటి నిర్వహణ ప్రాజెక్టులు

వరదనీటి నిర్వహణ కోసం రూ. 1,585.96 కోట్లు కేటాయించగా వీటికి రెండు మూడు రోజుల్లో టెండర్లను పిలవాలని భావిస్తున్నారు. మూడు ప్రత్యేక ప్యాకేజీల కింద ఈ పనులను చేపట్టనున్నారు.

ఈ-టెండర్ల ప్రక్రియ

ఈ మేరకు ట్రంక్ ఇంఫ్రాస్ట్రక్చర్ పనులకు ఈ-టెండర్లను ఇప్పటికే సీఆర్‌డీఏ తాజాగా ఆహ్వానించింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు టెండర్ల సమర్పణకు గడువుగా విధించింది. అలాగే జనవరి చివరి వరకు మరిన్ని టెండర్లు పిలిచే అవకాశం ఉంది. 2027 డిసెంబర్ నాటికి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం రూ.30,000 కోట్లకు పైగా విలువైన పనుల కోసం టెండర్లు పిలిచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ పలుమార్లు ప్రకటించారు. ఇప్పటికే సీఆర్‌డీఏ అధారిటీ, కేబినెట్ ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులు ఈ నెలలో టెండర్ల కు సిద్ధం అవుతున్నాయి.

ప్రత్యేక ప్రణాళికలు

రహదారులు, డ్రెయిన్లు, మంచినీటి సరఫరా, విద్యుత్, ప్లాంటేషన్ వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది ప్రభుత్వం. ముందుగా వాటిపైనే దృష్టి సారించింది. కార్యాచరణకు సిద్ధమైంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన మౌలిక సదుపాయాల కల్పన చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.

ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి

ప్రభుత్వం అమరావతిని కేవలం రాష్ట్ర రాజధానిగా కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, జీవన ప్రమాణాల పరంగా కీలక కేంద్రంగా మారనుంది. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేసి, భవిష్యత్‌లో రాజధాని ప్రజలకు మెరుగైన జీవన శైలిని అందించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం CRDA ను ఆదేశించింది. ఒక రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో ఈ నిర్మాణాలు మైలురాళ్ళుగా నిలవనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..