AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream : ఆకాశం నుంచి కిందపడుతున్నట్లుగా కలగంటున్నారా..! అయితే భవిష్యత్‌లో వీటిని ఎదుర్కోక తప్పదు..

Dream : మీరు నిన్న రాత్రి నిద్రపోయి ఉంటే కచ్చితంగా ఒక కలగని ఉండాలి. కానీ మీరు ఏ కల కనలేదని, చూడలేదని చెప్పవచ్చు. ఎందుకంటే

Dream : ఆకాశం నుంచి కిందపడుతున్నట్లుగా కలగంటున్నారా..! అయితే భవిష్యత్‌లో వీటిని ఎదుర్కోక తప్పదు..
Dream
uppula Raju
|

Updated on: Jul 13, 2021 | 3:54 PM

Share

Dream : ప్రతి ఒక్కరు నిద్ర పోతున్నప్పుడు ఎన్నో కలలు కంటారు. అందులో చాలా కలలు తెల్లవారేసరికి మనకు గుర్తుండవు. కానీ అందులో ఒక సంఘటన మాత్రం గుర్తుంటుంది. అయితే చాలా మంది కలలను పెద్దగా పట్టించుకోరు. అంతేకాదు వాటి గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. అయితే కొంతమంది ఆ కలలను సీరియస్‌గా తీసుకొని వాటి పరిణామాల గురించి ఆరా తీస్తారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం చాలా కలలు భవిష్యత్‌లో కొన్ని సూచనలను తెలియజేస్తాయి.

కలలో మనం ఆకాశం నుంచి పడినట్లుగా, లేదా ఏదైనా ఎత్తు నుంచి కిందపడుతున్నట్లుగా కనిపిస్తే మీరు భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే ఇది చెడు సంఘటనలను సూచిస్తుంది. భవిష్యత్తులో మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం. అంతేకాదు ఇటువంటి కలలు భవిష్యత్తులో పరువు నష్టం, ఆందోళనను సూచిస్తాయి. ఇంకా ఆరోగ్యం గురించి, అలసట, ప్రమాదాల గురించి హెచ్చరిస్తాయి. స్వప్నశాస్త్రం ప్రకారం జ్యోతిష్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతారు.

ఇటువంటి కలలు వ్యాపారవేత్తలకు, మహిళలకు కూడా హానికరం. గుండె, న్యూరో రోగులకు కూడా ఇలాంటి కలలు వస్తాయి. ఒక వ్యాపారవేత్త అటువంటి కలను చూస్తే అది అతని ఆదాయాన్ని తగ్గించబోతున్నదానికి సంకేతం. ఒక స్త్రీ అలాంటి కలను చూస్తే ఆమె భర్త అనేక సమస్యలతో బాధపడటానికి సంకేతం. ఇంకా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం. ఇది కాకుండా ఒక రోగి ఈ కలను చూస్తే అతని సమస్యలు ప్రస్తుతానికి కొనసాగుతాయని సూచిస్తుంది.