AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మాత్రం ఆగలేవా ఏంటి..! మరి కాసేపట్లో పెళ్లి అనగా వరుడు ఏం చేశాడంటే..!

తాజాగా ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమకు చపాతీలు ఆలస్యంగా పెట్టారని ఆగ్రహించిన వరుడు ఏకంగా పెళ్లి రద్దు చేసుకున్నాడు. అదే రోజు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. వరుడి తీరుతో షాకైన వధువు కుటుంబం చివరకు పోలీసులను ఆశ్రయించారు. వరుడు, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు..

ఆ మాత్రం ఆగలేవా ఏంటి..! మరి కాసేపట్లో పెళ్లి అనగా వరుడు ఏం చేశాడంటే..!
Subhash Goud
|

Updated on: Dec 29, 2024 | 6:07 PM

Share

ఓ పెళ్లి వేడుకలో వింత ఘటన ఎదురైంది. పెళ్లి విందు చపాతీలు వడ్డించడం ఆలస్యమైనందుకు ఓ వరుడు, అతడి కుటుంబ సభ్యులు వధువు కుటుంబీకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. అంతేకాదు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుని పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి పీటలమీద నుంచి వెళ్లిపోయిన వరుడు అనంతరం మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిసెంబర్ 22వ తేదీన తన కుటుంబం, బంధువులతో కలిసి వరుడు మెహతాబ్ పెళ్లి ఊరేగింపుగా హమీద్‌పూర్ గ్రామానికి చేరుకున్నాడు. అయితే పెళ్లి భోజనం వడ్డించారు. అయితే ఇందులో చపాతీలు వడ్డించడం ఆలస్యం కావడంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు వారిపై ఆగ్రహించారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు వారిని నచ్చజెప్పినా ఎంతకి వినిపించుకోలేదు. చివరకు పెళ్లి మధ్యలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

కాగా, అక్కడి నుంచి వెళ్లిపోయిన వరుడు మెహతాబ్ ఆ రాత్రికే బంధువైన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తీవ్ర అవమానానికి గురైన వధువు, ఆమె కుటుంబ సభ్యులు.. వరుడు, అతని కుటుంబ సభ్యులపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో డిసెంబర్‌ 24న జిల్లా ఎస్పీని కలిశారు. పెళ్లి కోసం ఏడు లక్షలు ఖర్చు చేశామని, వరుడికి కట్నంగా రూ.1.5 లక్షలు ఇచ్చినట్లు పోలీసుల ఫిర్యాదులో తెలిపారు. పెళ్లిని మధ్యలో వదిలేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడని హిందూస్తాన్ టైమ్స్ నివేదించింది. వరుడు మెహతాబ్‌, అతడి కుటుంబంపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరారు వధువు కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..
పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..
డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? ఈ సీక్రెట్
డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? ఈ సీక్రెట్
దేవ ఉత్థాన ఏకాదశి: నవంబర్ 20న మేల్కొంటున్న శ్రీమహావిష్ణువు..
దేవ ఉత్థాన ఏకాదశి: నవంబర్ 20న మేల్కొంటున్న శ్రీమహావిష్ణువు..
స్పెషల్ సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
స్పెషల్ సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
OTTలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హవా.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హవా.. IMDBలోనూ టాప్ రేటింగ్
క్రెడిట్ కార్డు బిల్లు లేట్‌గా చెల్లిస్తున్నారా..? ఇకపై వడ్డీలు..
క్రెడిట్ కార్డు బిల్లు లేట్‌గా చెల్లిస్తున్నారా..? ఇకపై వడ్డీలు..
సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ..
సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ..
4 వీల్​ డ్రైవ్​తో చిన్న సైజ్​ ఎలక్ట్రిక్​ Defender SUV వివరాలివే
4 వీల్​ డ్రైవ్​తో చిన్న సైజ్​ ఎలక్ట్రిక్​ Defender SUV వివరాలివే