Vastu Tips: లైఫ్‌లో ఎప్పుడూ ఈ 4 వస్తువును బదులుగా తీసుకోకండి.. దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్టే!
ప్రతి ఒక్కరు అప్పు తీసుకోవడం అనేది సర్వసాధారణం.. మన దైనందిన జీవితంలో, మనకు అవసరమైన ప్రతి సారి అప్పు తీసుకుంటాము. అలాగే అప్పులు ఇస్తుంటాము. మొదట్లో ఇది బాగానే అనిపించినా.. దీర్ఘ కాలంలో కొన్ని సమస్యలను తెచ్చి పెడుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువుల అరువుగా తీసుకోవడం వల్ల అశుభకరం కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకు సానుకూలంగా ఉంటాయి. మరికొన్ని మనం తీసుకునే సమయం, పద్దతి కారణంగా అవి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఒక వేల మీకు డబ్బు అప్పుగు తీసుకునే, ఇచ్చే అలవాటు ఉంటే.. ఇది మీకు తెలియకుండానే మీ జీవిత స్థిరత్వం, సంబంధాలు, సంపద, శ్రేయస్సు, మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. ఇలాగే మనం అరువుగా తీసుకొనే కొన్ని వస్తువులు కూడా వాటి ప్రభావాన్ని ఇచ్చే వారికి నుంచి తీసుకునే వారి వద్దకు చేరుతాయి. ఒక వేళ అది ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటే.. మీపై కూడా అదే ప్రభావం చూపుతుంది.
ఏ వస్తువులను అరువుగా తీసుకోకూడదు
గడియారం తీసుకోవడం వల్ల ప్రభావం: వాస్తు, జ్యోతిషశాస్త్రం ప్రకారం గడియారాన్ని , అదృష్టం, పురోగతి, జీవిత గమనానికి చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి మన మీ చేతి గడియారాన్ని వేరొకరికి ఇవ్వడం లేదా వేరొకరి గడియారాన్ని ధరించడం అశుభం అని నిపుణులు అంటున్నారు. ఒక వేల మరు వేరే వాళ్ల వాచ్‌ను తీసుకున్నప్పుడు దానికి వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనాలు, లేదా దుష్ఫలితాలు కూడా మీకు వస్తాయి. దీని ఫలితంగా పనిలో అడ్డంకులు, నెమ్మదిగా పురోగతి, సంబంధాలలో విభేదాలు, మానసిక ఒత్తిడి, అస్థిరత ఏర్పడవచ్చు.
రుమాలు అరువుగా తీసుకోవడం: టవాల్స్ ఇవి మన వ్యక్తిగత శక్తితో ముడిపడి ఉంటాయి. ఇది ఒక వ్యక్తి వ్యక్తిగత భావోద్వేగాలు, మానసిక స్థితి, శక్తిని గ్రహిస్తుంది. మీరు మీ టవాల్‌ను ఎవరికైనా ఇచ్చినప్పుడు లేదా వేరే వాళ్ల టవాల్‌ను మీరు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిపై ఉండే ప్రతికూల శక్తి కూడా మీకు వస్తుంది. దీని కారణంగా అపార్థాలు, విభేదాలు, వివాదాలు, ఉద్రిక్తత, సంబంధాలలో నమ్మకం లేకపోవడాన్ని పెంచుతుంది.
చీపురులు తీసుకోవడం: చీపురు కేవలం శుభ్రపరిచే సాధనం మాత్రమే కాదు, దీనిని శ్రేయస్సు, లక్ష్మీ శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి మనం వేరే వాళ్ల చీపురును ఉపయోగించడం వల్ల వారి ఇంటి నుండి ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి వస్తుంది. ఇది శ్రేయస్సును తగ్గిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలను పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది, ఖర్చులను పెంచుతుంది, ఉద్రిక్తత, సంఘర్షణను పెంచుతుంది.
సాయంత్రం ఈ వస్తువులను అరువుగా ఇవ్వడం, తీసుకోవడం: సాయంత్రం అనేది శక్తి మార్పు సమయం. ఈ సమయంలో పాలు, పెరుగు, చక్కెర, బియ్యం, ఉప్పు వంటి తెల్లటి వస్తువులను ఇవ్వడం అశుభంగా పరిగణించబడుతుంది. ఈ వస్తువులు ప్రశాంతమైన శక్తి, శ్రేయస్సును సూచిస్తాయి. సాయంత్రం ఇంట్లో నుంచి వీటిని బయటకు ఇవ్వడం వల్ల ఇంటి శ్రేయస్సు తగ్గుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కాబట్టి, ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే అటువంటి వస్తువులను అరువుగా ఇవ్వడం లేదా తీసుకోవడం చేయడండి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




