మీ పర్సు లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో ఈ వస్తువులు అస్సలు ఉంచుకోకండి.. మర్చిపోతే మీ సంగతి అంతే ఇక..
సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఖచ్చితంగా మనతోపాటు చిన్న పర్స్ తీసుకుని వెళ్తాము. స్త్రీలు, పురుషులు ఇద్దరూ తమ
సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఖచ్చితంగా మనతోపాటు చిన్న పర్స్ తీసుకుని వెళ్తాము. స్త్రీలు, పురుషులు ఇద్దరూ తమ నిత్యావసర వస్తువులను తీసుకెళ్లేందుకు పర్సు ఉపయోగిస్తారు. చాలా సార్లు తెలిసి, తెలియక మన పర్సులో అవసరం లేని వస్తువులు పెట్టుకుంటాం కానీ వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యం. మన పర్సులో ఎలాంటి వస్తువులు ఉండాలి.. ఎలాంటివి ఉండకూడదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలా మంది పర్సులో డబ్బు ఖచ్చితంగా ఉంటుంది. అయితే పర్సులో కొన్ని వస్తువులు ఉండడం వలన ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మరి పర్సులో అవసరం లేని వస్తువులు లేకుండా చూసుకోవడం ఎలాగో తెలుసుకుందామా.
పర్సులో ఏం ఉండకూడదు.. * సాధారణంగా ఏమైనా కొనుగోలు చేసిన తర్వాత బిల్లును పర్సులో పెట్టుకోవడం కొందరికి అలవాటు. కానీ ఆ బిల్లును ఎక్కువ కాలం పర్సులో పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి డబ్బుకు లోటు ఏర్పడుతుంది.
* వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో ఎప్పుడూ ఏ దేవత ఫోటోలను ఉంచుకోకూడదు. అలాగే చనిపోయిన కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా తన పర్సులో ఉంచుకోకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల వ్యక్తి అప్పులు పెరుగుతాయి.
* వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో ఏ వ్యక్తి ఫోటో పెట్టుకోకూడదు. పర్స్‌లో లక్ష్మి దేవత ఉందని, పర్సులో వ్యక్తి బొమ్మ ఉంచితే వాస్తు దోషం ఉందని నమ్ముతారు.
* పర్సులో తాళం చెవిని ఉంచుకోవడం మానుకోండి. కీని పర్సులో ఉంచుకోవడం వల్ల వ్యాపారంలో నష్టం ఏర్పడుతుంది. అలాగే చిరిగిన నోట్లను పర్స్‌లో ఉంచుకోవడం కూడా మానేయాలి.
పర్సులో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి..
* వాస్తు శాస్త్రం ప్రకారం చిటికెడు బియ్యాన్ని పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ డబ్బు స్తబ్దుగా ఉంటుంది. దీనితో పాటు లక్ష్మి దేవి ఆశీస్సులు ఉంటాయి.
* డబ్బును సక్రమంగా ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ముందుగా పెద్ద నోట్లను, తర్వాత చిన్న నోట్లను, ఆపై చిన్న నోట్లను ఉంచండి. నాణేలు, నోట్లను ఎప్పుడూ కలిసి ఉంచకూడదు. నాణేల మోత వల్ల లక్ష్మి ఒక్క చోట ఉండదు.
గమనిక:- ఈ కథనం కేవలం వాస్తు ప్రకారం.. సాధారణ ఊహలపై ఆధారపడింది. అధికారికంగా ధృవీకరించలేము..
Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‌తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..
Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..