AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toothpaste Uses: టూత్‌పేస్ట్‌తో ఎన్ని ప్రయోజనాలో.. దంతాలు శుభ్రం చేయడానికి మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే..!

Toothpaste Benefits: మనం నిత్యం ఉపయోగించే వస్తువులో టూత్ పేస్ట్ కూడా ఒకటి. అయితే ఈ టూత్ పేస్ట్ మన దంతాలను శుభ్రం చేయడానికే కాక చర్మ సమస్యలు, కాలిన గాయాలకు చెక్ పెట్టడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక మరోెన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుంది...

Toothpaste Uses: టూత్‌పేస్ట్‌తో ఎన్ని ప్రయోజనాలో.. దంతాలు శుభ్రం చేయడానికి మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే..!
Toothpaste Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 19, 2023 | 8:00 AM

Share

Toothpaste Benefits: మనం నిత్యం ఉపయోగించే వస్తువులో టూత్ పేస్ట్ కూడా ఒకటి. అయితే ఈ టూత్ పేస్ట్ మన దంతాలను శుభ్రం చేయడానికే కాక చర్మ సమస్యలు, కాలిన గాయాలకు చెక్ పెట్టడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక మరోెన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. అసలు టూత్ పేస్ట్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మొటిమలు: చాలా మందికి మొటిమలు పెద్ద చర్మ సమస్యగా ఉంటాయి. పైగా మొటిమల వల్ల మీ ముఖంపై మచ్చలు పడి ఆందోళన కలిగించేలా ఉంటాయి. అయితే ఇకపై ఆందోళన, మొటిమల సమస్య అవసరం లేదు. నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి మొటిమలపై టూత్ పేస్టును రాయండి. కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఇలా చేస్తే మొటిమల సమస్యకు పూర్తి ఉపశమనం లభిస్తుంది.

ఫేస్ ప్యాక్: ముఖంపై ముడతలతో బాధపడుతున్నావారు టూత్‌పేస్ట్‌ను ఫేస్ ప్యాక్‌గా వాడుకోవచ్చు. ఇందుకోసం మీరు టూత్‌పేస్ట్‌తో నిమ్మకాయ రసం కూడా కలిపి వాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కాలిన గాయాలు: టూత్‌పేస్ట్ కాలిన గాయల నివారణకు కూాడా ఉపయోగకరం. ఇందుకోసం మీరు మొదటిగా కాలిన ప్రదేశాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఆ తర్వాత వెంటనే అక్కడ టూత్‌పేస్ట్‌ను పూయిండి. టూత్‌పేస్ట్ కూడా ఆ ప్రదేశానికి చల్లదనాన్ని ఇచ్చి, గాయం తగ్గేలా చేస్తుంది.

ఆభరణాల శుభ్రం: టూత్‌పేస్ట్ ఆభరణాలను శుభ్రం చేయడంలో కూడా పనిచేస్తుంది. ఇందుకోసం వెండి, బంగారపు ఆభరణాలపై టూత్‌పేస్ట్ పూసి శుభ్రం చేయండి.. తలతలా మెరిసిపోతాయి.

దుస్తుల మరకలకు చెక్: క్లాత్స్ మీద పడిన ఇంక్ వంటి మరకలను తొలగించడానికి టూత్‌పేస్ట్ సహకరిస్తుంది. ఇందుకోసం మరకలపై టూత్ పేస్ట్ రాసి రుద్దితే చాలు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..