Fuel Tips: పెట్రోల్‌ ధరలతో బేజార్‌ అవుతున్నారా.? ఈ టిప్స్‌ పాటిస్తే ఎక్కువ మైలేజ్‌ మీ సొంతం..

Fuel Tips: దేశంలో ఇంధన ధరలు చుక్కులు చూపిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ. 120కి చేరుకుంది. ఇక డీజిల్ కూడా పెట్రోల్‌తో పోటీపడీ మరీ పెరుగుతోంది. దీంతో వాహనాలు బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది...

Fuel Tips: పెట్రోల్‌ ధరలతో బేజార్‌ అవుతున్నారా.? ఈ టిప్స్‌ పాటిస్తే ఎక్కువ మైలేజ్‌ మీ సొంతం..
Fuel Tips
Follow us

|

Updated on: May 07, 2022 | 12:11 PM

Fuel Tips: దేశంలో ఇంధన ధరలు చుక్కులు చూపిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ. 120కి చేరుకుంది. ఇక డీజిల్ కూడా పెట్రోల్‌తో పోటీపడీ మరీ పెరుగుతోంది. దీంతో వాహనాలు బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు లీటర్‌ పెట్రోల్‌ కొట్టిస్తే ఎంచక్కా ఊరంతా తిరిగే వారు ఇప్పుడు సగం దూరం కూడా వెళ్లడం లేదు. అయితే కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించడం ద్వారా ఎక్కువ మైలేజ్‌ను పొందొచ్చనే విషయం మీకు తెలుసా.? ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

  1.  మీరు వాహనాన్ని ఎలా నడుపుతారన్నదాన్ని బట్టి మైలేజ్ ఆదారపడి ఉంటుంది. బైక్‌ లేదా కారును ఒకేసారి రేస్‌ చేయకుండా ఎకానమి స్పీడ్‌లో వెళితే కచ్చితంగా మైలేజ్‌ పెరుగుంది.
  2. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు చాలా మంది ఇంజన్‌ ఆప్‌ చేయరు. కానీ పెద్ద నగరాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయితే కనీసం 5 నిమిషాలైనా వాహనాలు ఆగిపోతాయి. అలాంటి సమయల్లో ఇంజన్‌ ఆఫ్‌ చేయడం వల్ల మైలేజ్‌తో పాటు, కాలుష్యాన్ని కూడా కంట్రోల్ చేసిన వారవుతాం.
  3. ఇక కార్లు ఉపయోగిస్తున్న వారు ఏసీ ఆఫ్‌ చేయడం అలవాటు చేసుకోండి. విండోస్‌ను కాస్త కిందికి దించి ఏసీ వినియోగాన్ని తగ్గించుకోవాలి. దీని ద్వారా కూడా మైలేజ్‌ పెరుగుతుంది.
  4. వాహనాల టైర్లలో ఉండే గాలి కూడా మైలేజ్‌ను డిసైడ్‌ చేస్తుంది. తక్కువ గాలి ఉండడం వల్ల తక్కువ మైలేజ్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పకిప్పుడు గాలిని చెక్‌ చేసుకుంటూ ఉండాలి.
  5. వాహనాలను సమయానికి సర్వీసింగ్ చేయడం ద్వారా కూడా మైలేజ్ పెరుగుతుంది. సర్వీసింగ్‌ చేయడం ద్వారా డబ్బులు వృథా అనే భావన కొందరిలో ఉంటుంది. అయితే మైలేజ్‌ రూపంలో నష్టమే ఎక్కువ అనే విషయాన్ని మర్చిపోకూడదు.
  6. వాహనాన్ని నడుపుతున్న సమయంలో ఏటవాలు రోడ్లు ఉన్న చోట వీలైనంత వరకు ఇంజన్‌ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రయాణ సమయం ఎక్కువైనా మైలేజ్‌ మాత్రం వస్తుంది.
  7. టూవీలర్‌ మైలేజ్‌ వాటి చైన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చైన్‌ లూజ్‌గా ఉంటే ఇంజన్‌పై ఎక్కువ భారం పడుతుంది. తద్వార మైలేజ్‌ తగ్గుతుంది. కాబట్టి చైన్‌ అడ్జెస్ట్‌మెంట్ చేస్తుండాలి.

Also Read: Airtel Broadband: ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో అంతరాయం.. ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులు!

Tirumala: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి వారపు సేవలకు తాత్కాలికంగా బ్రేక్..

Nielsen Study: భారత్‌లో భారీగా పెరుగుతోన్న ఇంటర్‌నెట్ వాడకం.. పట్టణాల్లో కంటే పల్లెల్లోనే అధికం..