Nielsen Study: భారత్‌లో భారీగా పెరుగుతోన్న ఇంటర్‌నెట్ వాడకం.. పట్టణాల్లో కంటే పల్లెల్లోనే అధికం..

Nielsen’s Bharat 2.0 Study: ప్రస్తుతం అంతా టెక్నాలజీ యుగం నడుస్తోంది. అందరికీ స్మార్ట్‌ ఫోన్‌లు (SamrtPhone) అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్‌ ఛార్జీలు సైతం తగ్గడంతో ఇంటర్‌నెట్‌ వినియోగం భారీగా పెరిగింది. అయితే ఈ వినియోగం అందరూ అనుకుంటున్నట్లు..

Nielsen Study: భారత్‌లో భారీగా పెరుగుతోన్న ఇంటర్‌నెట్ వాడకం.. పట్టణాల్లో కంటే పల్లెల్లోనే అధికం..
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2022 | 8:26 AM

Nielsen’s Bharat 2.0 Study: ప్రస్తుతం అంతా టెక్నాలజీ యుగం నడుస్తోంది. అందరికీ స్మార్ట్‌ ఫోన్‌లు (SamrtPhone) అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్‌ ఛార్జీలు సైతం తగ్గడంతో ఇంటర్‌నెట్‌ వినియోగం భారీగా పెరిగింది. అయితే ఈ వినియోగం అందరూ అనుకుంటున్నట్లు పట్టణాల్లో కంటే ఎక్కువ గ్రామాల్లోనే పెరగడం గమనార్హం. ఈ విషయం చెబుతోంది ఎవరో కాదు. నీల్సన్‌ అనే ఇంటర్నేషనల్ కంపెనీ చేసిన సర్వేలో తేలిన విషయాలు. భారత్‌ 2.0 ఇంటర్నెట్‌ స్టడీ పేరుతో గతేడాది సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్ మధ్య చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 64.6 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారు.

వీరిలో పట్టణాలకు చెందిన యూజర్ల సంఖ్య 29.4 కోట్లు కాగా, పల్లెల్లో ఏకంగా 35.2 కోట్ల మంది ఉన్నారు. ఈ లెక్కన చూస్తే పట్టణాలతో పోల్చితే పల్లెల్లో ఇంటర్‌నెట్‌ వినియోగదారుల సంఖ్య 20 శాతం అధికంగా ఉంది. 2019 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ వాడుతోన్న వారి సంఖ్య 45 శాతం పెరిగినప్పటికీ, ఇంకా 60 శాతం మందికి సేవలు అందుబాటులో లేవు. అలాగే నగరవాసుల్లో 59 శాతం నెట్‌ వాడుతుండగా రెండేళ్లలో 28 శాతం మంది ఇంటర్‌నెట్ యూజర్లు పెరిగారు. ఇక దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ వాడుతోన్న వారి సంఖ్య 2019తో పోల్చితే ఏకంగా 60 శాతం పెరిగింది.

12 ఏళ్లు నిండి వారిలో 59.2 కోట్ల మంది ఇంటర్‌నెట్‌ ఉపయోగిస్తున్నారు. ఇంటర్‌నెట్ వాడుతోన్న వారిలో 60 శాతం మంది మహిళలే కావడం విశేషం. అంతేకాకుండా ఈ రెండేళ్లలో ఇంటర్‌నెట్‌ వాడుతోన్న మహిళ సంఖ్య 61 శాతం పెరగగా మగవారిలో ఇది 28 శాతం మాత్రం ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే 50.03 కోట్ల మంది కేవలం సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వీడియోలు, మ్యూజిక్‌ కోసమే ఇంటర్‌నెట్ వాడుతున్నట్లు సర్వేలో తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Telangana: కట్టుకున్నవాడిని కాదని, ప్రియుడితో వెళ్లింది. కానీ, కొన్ని రోజుల్లోనే సీన్‌ రివర్స్‌

Tajinder Bagga: బీజేపీ నేత తాజిందర్‌సింగ్‌ అరెస్ట్‌పై రాజకీయ రగడ.. మూడురాష్ట్రాల మధ్య వివాదం..

Gyanvapi Controversy: కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో గౌరీ దేవి ప్రతిమలపై సర్వే.. కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు