Tajinder Bagga: బీజేపీ నేత తాజిందర్‌సింగ్ అరెస్ట్‌పై రాజకీయ రగడ.. మూడురాష్ట్రాల మధ్య వివాదం..
పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.. హర్యానా పోలీసులు విడిపించారు.. ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఢిల్లీ బీజేపీ నేత తాజిందర్‌సింగ్ అరెస్ట్ వ్యవహారం మూడురాష్ట్రాల మధ్య వివాదంగా మారింది.
ఒక బీజేపీ నేత అరెస్ట్ వ్యవహారం మూడు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఢిల్లీ బీజేపీ నేత తాజిందర్‌సింగ్ బగ్గాను(Tajinder Bagga) పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేయడం .. హర్యానా పోలీసులు విడిపించడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం అంతరాష్ట్ర వివాదంగా మారింది. బగ్గా అరెస్ట్ బీజేపీ-ఆప్ నేతల మధ్య మాటలయుద్దానికి దారితీసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను బెదిరించినట్టు పంజాబ్‌లో తాజిందర్‌పై కేసు నమోదయ్యింది. ఢిల్లీ లోని తాజిందర్‌నివాసానికి వచ్చిన పంజాబ్ పోలీసులు ఆయన్ను అదుపు లోకి తీసుకున్నారు. అయితే అక్రమంగా అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు , బీజేపీ నేతలు ఆరోపించారు. తాజిందర్‌సింగ్‌ను కిడ్నాప్ చేశారని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజిందర్‌సింగ్‌ను పంజాబ్ పోలీసులు తీసుకెళ్తుండగా కురుక్షేత్రలో అడ్డుకున్నారు హర్యానా పోలీసులు . తాజిందర్‌ను తమ ఆధీనం లోకి తీసుకున్నారు. తరువాత హర్యానా పోలీసులు ఆయన్ను ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. . ఆ సమయంలో తజిందర్ పాల్ సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఆ వ్యాఖ్యలపై పంజాబ్‌లోని మొహాలీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాబ్ పోలీసులు దర్యాప్తునకు హాజరవ్వాలంటూ గతంలో పలుమార్లు తజిందర్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే వాటికి స్పందించకపోవడంతో ఢిల్లీ లోని తాజిందర్‌ను ఢిల్లీ లోని ఆయన ఇంట్లో పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే పంజాబ్ పోలీసులు తాజిందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేవారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఉదయం 10-15 మంది పోలీసులు తమ ఇంటికి వచ్చి దాడి చేశారని తాజిందర్ తండ్రి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడికి ఎక్కడికో తీసుకెళ్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ ల్లీ పోలీసులు.. పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తాజిందర్ అరెస్టు గురించి పంజాబ్ పోలీసులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఢిల్లీ ల్లీ పోలీసులు ఆరోపించారు. తేజిందర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు తోనే ఆయన్ను ఢిల్లీకి తిరిగి తీసుకొచ్చినట్టు తెలిపారు.
అయితే ఢిల్లీ పోలీసుల ఆరోపణలను పంజాబ్ పోలీసులు ఖండించారు. చట్ట ప్రకారమే తాజిందర్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఢిల్లీ,హర్యానా పోలీసుల తీరును సవాల్ చేస్తూ పంజాబ్ పోలీసులు పంజాబ్ -హర్యానా ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో ఈ వ్యవహారంపై వాడివేడి వాదనలు జరిగాయి. హర్యానా పోలీసుల కస్టడీలో బగ్గాను ఉంచాలన్న పంజాబ్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
జాతీయ వార్తల కోసం..
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సరూర్ నగర్ హత్యపై డిటేల్డ్ రిపోర్టు తెప్పించండి.. అధికారులను ఆదేశించిన గవర్నర్ తమిళిసై..
AP Politics: సీఎం జగన్ మాటే మా బాట.. ఊహాగానాలకు చెక్ పెట్టిన వైసీపీ ట్రబుల్ షూటర్లు..