Youngest Mum: ప్రపంచంలోనే అతి చిన్న వయసులో తల్లైన చిన్నారిగా రికార్డ్.. 5ఏళ్లకే తల్లైన బాలిక.. 90 ఏళ్లైనా నేటికీ విచిత్రమే.

పెరు దేశంలోని టిక్రాపోకు చెందిన లీనా మదీనా.. 1933 సెప్టెంబర్‌ 27న జన్మించింది. అందరితోపాటు ఆడుతూ పాడుతూ సంతోషంగా తన బాల్యాన్ని గడపాల్సిన లీనా.. ఐదేళ్లకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది జరిగి సుమారు 90 ఏళ్ళు అయినా.. ఇప్పటికీ నమ్మశక్యంకాని నిజంగా చరిత్రలో మిగిలిపోయింది.

Youngest Mum: ప్రపంచంలోనే అతి చిన్న వయసులో తల్లైన చిన్నారిగా రికార్డ్.. 5ఏళ్లకే తల్లైన బాలిక.. 90 ఏళ్లైనా నేటికీ విచిత్రమే.
Lina Medina De
Follow us

|

Updated on: May 10, 2022 | 4:37 PM

Youngest Mum: చరిత్ర తరచి చూస్తే.. ఎన్నో వింతలు, విశేషాలు.. నమ్మశక్యం కానీ అనేక సంఘటనలు దర్శనమిస్తాయి. కొన్ని వింతలు ఇప్పటికీ సైన్స్ కు సవాల్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి కొన్ని ఏళ్ల క్రితం చోటు చేసుకున్న వింతలూ, విశేషాలు సమయానుకూలంగా వెలుగులోకి మళ్ళీ మానవాళికి వాటిని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా అత్యంత ఆశ్చర్యకరమైన, నమ్మాలా వద్దా అనిపించే వార్త ఒకటి మళ్ళీ షేర్ అవుతుంది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసి ప్రాయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఐదేళ్ల చిన్నారి. అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంటర్నెట్, సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఈ వార్త సంచలనం సృష్టించింది. పెరు దేశం ( Peruvian ) లోని టిక్రాపోకు చెందిన లీనా మదీనా (Lina Medina de) .. 1933 సెప్టెంబర్‌ 27న జన్మించింది. అందరితోపాటు ఆడుతూ పాడుతూ సంతోషంగా తన బాల్యాన్ని గడుపుతూ వచ్చింది. లీనాకు ఐదేళ్ల వయసు వచ్చేసరికి.. చిన్నారి పొట్ట కాస్త పెరగడాన్ని కుటుంబసభ్యులు గమనించారు. దాంతో వైద్యున్ని ఆశ్రయించారు. ముందుగా లీనా కడుపులో ఏదో కణతి లాంటిది ఉండొచ్చని డాక్టర్లు భావించారు. అందుకు తగిన వైద్య పరీక్షలు చేసిన వైద్యులకు షాక్ ఇస్తూ.. లీనా కడుపులో ఉన్నది కణతి కాదు.. బిడ్డ అని తెలిసింది.

ఐదేళ్ల పాపకు తల్లి కావడమా అంటూ వైద్యులంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ విషయాన్ని పాపతో పాటు వారి తల్లిదండ్రులకు చెప్పారు. తరువాత 1939 మే 14న సిజేరియన్ ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది లీనా. పుట్టినప్పుడు ఆ బిడ్డ బరువు 2.7 కిలోలు ఉంది. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఐదేళ్ల చిన్నారికి బిడ్డ పుట్టడం ఎలా సాధ్యమని పెరూ వైద్యులు రీసెర్చ్‌ చేశారు. లీనాకు ప్రికోషియస్ ప్యుబర్టీ (Pricosius puberty) అనే సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అందువల్లే చిన్న వయసులోనే లైంగిక అవయవాలు అభివృద్ధి చెందినట్లు కనుగొన్నారు. దాంతో మూడేళ్ల వయసులోనే లీనాకు పీరియడ్స్‌ రావడం ప్రారంభమైందని తెలుసుకున్నారు. కానీ గర్భవతి ఎలా అయిందన్న విషయం మాత్రం తెలీలేదు. ఈ సమయంలోనే టిక్రాపోలో ఓ సాంప్రదాయ పండగ వచ్చింది. లీనా తెగవారి సాంప్రదాయం ప్రకారం.. ఈ పండగ సందర్భంగా ఇష్టమైన యువతీ, యువకులు శృంగారంలో పాల్గొంటారు. ఆ సమయంలోనే లీనా ఎవరితోనో శృంగారంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఫలితంగా చిన్న వయసులోనే అమ్మ అయింది. ఇది జరిగి 90 ఏళ్లు అవుతోంది. అయినా ఐదేళ్లకే అమ్మవడం వైద్య శాస్త్రంలో సంచలనంగానే మిగిలిపోయింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి