Odisha: చదివింది 7వ తరగతి వరకే.. ప్లాస్టిక్ వ్యర్ధాలతో రెండు చేతులా సంపాదిస్తున్న యువకుడు..

ఒడిశాలోని రాధాచరణ్​పూర్ కు చెందిన అజయ్. నిజానికి అజయ్ చదివింది ఏడో తరగతి మాత్రమే.. అయితే భూమి మీద చెత్తగా పేరుకుంటూ.. భారంగా మారిన ప్లాస్టిక్, పాలిథీన్ వంటి వస్తువులతో ఉపయోగపరమైన ఇంధనం తయారు చేస్తున్నాడు.

Odisha: చదివింది 7వ తరగతి వరకే.. ప్లాస్టిక్ వ్యర్ధాలతో రెండు చేతులా సంపాదిస్తున్న యువకుడు..
Young Man Made Petrol Out O
Follow us

|

Updated on: May 10, 2022 | 4:02 PM

Odisha: వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తూ.. ఓ వైపు తమకంటూ ఓ స్పెషల్ గుర్తింపు.. మరోవైపు పర్యావరణ పరిరక్షణ చేసేవారు ఎందరో ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద సమస్య వాతావరణ కాలుష్యం అయితే.. అందులో ముఖ్యంగా ప్లాస్టిక్( Plastic) కారకాలు ఒకటి. ఆధునిక సమయంలో మనిషి జీవితంలో ప్లాస్టిక్ వాడకం ముఖ్యభాగమైపోయింది. తాగే నీరు, తినే తిండి. అన్నిటికి ప్లాస్టిక్ వస్తువులనే ఉపయోగిస్తున్నాం.. పట్టణాలు, పల్లెలు, కొండలు, కోనలు, సముద్రాలు ఇలా సర్వం ప్లాస్టిక్ మాయం. సమస్త భూమండలం ప్లాస్టిక్ తోనే నడుస్తోంది. అయితే ఈ ప్లాస్టిక్ భూమిలో ఇంకదు.. నీటిలో కరగదు. అంతేకాదు.. ప్లాస్టిక్ లో నిల్వ చేసిన ఆహారం అనారోగ్య కారకం.. ఇలా మొత్తానికి ప్లాస్టిక్ మానవాళికి ఓ పెను భూతంగా మారిపోయింది. అయితే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ పర్యావరణ పరిరక్షకులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.  ప్లాస్టిక్ కు బదులు ప్రత్యామ్న్యాయ వస్తువులు సూచిస్తున్నారు. అయితే ఓ యువకుడు పాలిథీన్​, ప్లాస్టిక్​ బాటిళ్ల వ్యర్ధాలకు అర్ధం కలిపిస్తూ సరికొత్త ప్రయత్నం చేశాసాడు. పాలిథీన్​, ప్లాస్టిక్​ బాటిళ్లతో పెట్రోల్, గ్యాస్ ను( Petrol from Polythene) తయారు చేస్తూ.. అందరికి షాక్ ఇచ్చాడు. అన్ని రకాల ప్లాస్టిక్‌ వ్యర్ధాల నుంచి నాణ్యమైన ముడి చమురుని తయారు చేస్తున్నాడు.. ఒడిశాకు చెందిన ఓ యువకుడు.

భిన్నమైన ఆలోచన, తాను చేయాలన్న పనిపై పూర్తి అవగాహన పట్టుదల ఉంటే చదువుతో పనిలేదని నిరూపిస్తున్నాడు ఒడిశాలోని రాధాచరణ్​పూర్ కు చెందిన అజయ్. నిజానికి అజయ్ చదివింది ఏడో తరగతి మాత్రమే.. అయితే భూమి మీద చెత్తగా పేరుకుంటూ.. భారంగా మారిన ప్లాస్టిక్, పాలిథీన్ వంటి వస్తువులతో పెట్రోల్ ని తయారు చేస్తున్నాడు. రోజుకు రోజుకు 12 నుంచి 13 కేజీల పాలిథీన్​ను సేకరించి .. వీటి సాయంతో సుమారు 7-8 లీటర్ల పెట్రోల్​ను తయారుచేస్తున్నాడు.ఇలా పెట్రోల్ తయారు చేయడం కోసం పెట్టుబడి పెట్టడానికి తన బైక్​ను రూ. 80 వేలకు అమ్మేశాడు. మరికొంద సొమ్ముని.. స్నేహితుల వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బుతో ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేశాడు. పాలిథీన్, వాటర్​ బాటిళ్లను నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మండించి పెట్రోల్​ను తయారు చేస్తున్నాడు అజయ్. ఒక కేజీ పాలిథీన్​తో 600 గ్రాముల పెట్రోల్​ తయారవుతుందని చెప్పాడు.  ఇలా తయారు చేసిన లీటరు  పెట్రోల్​తో  బైక్​పై 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. ప్రభుత్వం సాయం చేస్తే మరిన్ని పరిశోధనలు చేసి.. తక్కువ ధరకే పెట్రోల్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా చేస్తానని చెబుతున్నాడు అజయ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..