Summer Tour 2022: దక్షిణ భారతదేశంలో ఈ ఫేమస్ బీచ్‌లకు ఎప్పుడైనా వెళ్లారా? ప్రకృతి అందాలకు నెలవులు..
Best Tourist Places In South India During Summerఈ వేసవిలో టూర్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఐతే మన దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ బీచ్‌ల వైపు కూడా ఓ లుక్కేయండి. దక్షిణ భారతంలోని ఫేమస్ బీచ్‌లు ఇవే..
Updated on: May 10, 2022 | 3:42 PM

Best Tourist Places In South India During Summer: ఈ వేసవిలో టూర్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఐతే మన దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ బీచ్‌ల వైపు కూడా ఓ లుక్కేయండి. దక్షిణ భారతంలోని ఫేమస్ బీచ్‌లు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్.. ఇక్కడ సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి.

కర్ణాటకలోని గోకర్ణలోనున్న ఓం బీచ్ చాలా ఫేమస్. గోకర్ణం సాంస్కృతికంగా, సాంస్కృతికంగా, మతపరంగా కూడా ప్రసిద్ధి చెందింది.

చెన్నైలోని ఇలియట్ బీచ్ చాలా ప్రసిద్ధి చెందింది. కుటుంబ సమేతంగా వెళ్లేందుకు ఇది చక్కటి ప్రదేశం. ఈ బీచ్ చెన్నై నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బీచ్ చుట్టూ అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.

అండమాన్ నికోబార్ బీచ్.. అద్భుతమైన ప్రకృతి అందాలతో ఉండే ఈ ప్రాంతాన్ని కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా వెళ్తుంటారు.

దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కొచ్చి ఒకటి. ఈ బీచ్‌కు ఒంటరిగా లేదా కుటుంబంతో విహారయాత్రకు వెళ్లవచ్చు. కొచ్చిలో చెరాయ్ బీచ్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, మట్టంచెర్రీ ప్యాలెస్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.




