AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అసలే సండే.. ఆపై స్పెషల్ ఆఫర్‌. ఇంకేముంది మటన్‌ షాపులో ఎగబడ్డ జనం..!

అసలే సండే.. ఆపై స్పెషల్ ఆఫర్‌. ఇంకేముంది జనం ఎగబడ్డారు. మటన్ కొనేందుకు పెద్ద పెద్ద క్యూలు కట్టారు. కిలో మటన్ కొంటే 300 రూపాయలు తగ్గింపు. ఈ ఆఫర్ రెడీ చేసిన మటన్ షాప్ యజమాని ముందే ప్రచారం చేశాడు.

Telangana: అసలే సండే.. ఆపై స్పెషల్ ఆఫర్‌. ఇంకేముంది మటన్‌ షాపులో ఎగబడ్డ జనం..!
Mutton Shop Offer
N Narayana Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 07, 2024 | 3:51 PM

Share

అసలే సండే.. ఆపై స్పెషల్ ఆఫర్‌. ఇంకేముంది జనం ఎగబడ్డారు. మటన్ కొనేందుకు పెద్ద పెద్ద క్యూలు కట్టారు. కిలో మటన్ కొంటే 300 రూపాయలు తగ్గింపు. ఈ ఆఫర్ రెడీ చేసిన మటన్ షాప్ యజమాని ముందే ప్రచారం చేశాడు. దీనికి తోడు సండే రోజు ఈ ఆఫర్ ఉంటుందన్న సమాచారం ఈ నోట, ఆ నోట ఆ ప్రాంతంలో ఉండే వారందరికి చేరిపోయింది. అంతే సండే రోజు ఉదయాన్నే షాప్‌ ముందు జనం బారులు తీరారు. ఉదయం మొదలైన సందడి సాయంత్రం వరకు సాగింది.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో న్యూ గోల్డెన్ మటన్ మార్కెట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా దుకాణం యజమాని మటన్ ఆఫర్ ను ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్ లో మటన్ ధర రూ.900 ఉండగా ఏకంగా కిలో మటన్ కేవలం 680 రూపాయలకే విక్రయించారు. ఈ ఆఫర్‌తో మాంస ప్రియులు పెద్దఎత్తున ఎగబడ్డారు. ఆదివారం కావడంతో నేలకొండపల్లి స్థానికులే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ విషయం తెలిసి భారీగా మాంస ప్రియలు దుకాణాలకు తరలివచ్చారు.

సండే స్పెషల్ అని మటన్ షాప్ యజమాని ప్రకటించిన ఆఫర్ అందరి దృష్టి ఆకర్షించింది. కిలోమీటర్ల దూరం క్యూలో నిలబడి, గంట ఆలస్యమైన పర్వాలేదని వెయిటింగ్ చేసి మరి మటన్ కొనుగోలు చేశారు. మా దగ్గర కేజీ మటన్ తీసుకుంటే రూ.300 తగ్గింపు అన్నది సండే ఆఫర్. జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. వినియోగదారులు గంటల తరబడి క్యూలో నిలబడటంతో ఓ చిన్నపాటి వెయిటింగ్ రూమ్‌ ఏర్పాటు చేశాడు ఓనర్. మటన్ షాప్‌ స్పెషల్ ఆఫర్‌ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఆఫర్‌ మటన్ షాప్ యజమాని గల్ల నింపగా జనం నాలుగు ముక్కలు ఎక్కువ లాగించేశారు. ఆఫర్లు, జనం తాకిడి ఈ తరహాలో ఉంటే వచ్చే రోజుల్లో బందోబస్తు పెట్టాల్సి వస్తుందో ఏమో అన్న చర్చ నడుస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…