Telangana: నీటి జాడ లేని చోట ఉబికి వస్తున్న పాతాళ గంగ.. వింత చూసేందుకు ఎగబడ్డ జనం!

వర్షాలు, భూగర్భ జలాలు అంతంత మాత్రమే. సమీపంలో జలాశయాలు, చెరువులు కానీ ఏమీ లేవు. వ్యవసాయ బోరు నుండి నీళ్లు కావాలంటే మోటారు ఆన్ చేయాల్సిందే. కానీ, అదేమీ లేకుండానే ఆ వ్యవసాయ బోరు నుండి నీరు ఉబికి వస్తోంది. దీంతో ఈ వింత ఘటనను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

Telangana: నీటి జాడ లేని చోట ఉబికి వస్తున్న పాతాళ గంగ.. వింత చూసేందుకు ఎగబడ్డ జనం!
Bore Well
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 07, 2024 | 2:07 PM

వర్షాలు, భూగర్భ జలాలు అంతంత మాత్రమే. సమీపంలో జలాశయాలు, చెరువులు కానీ ఏమీ లేవు. వ్యవసాయ బోరు నుండి నీళ్లు కావాలంటే మోటారు ఆన్ చేయాల్సిందే. కానీ, అదేమీ లేకుండానే ఆ వ్యవసాయ బోరు నుండి నీరు ఉబికి వస్తోంది. దీంతో ఈ వింత ఘటనను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. మోటారు లేకుండానే పాతాళ గంగపైకి ఉబికి వస్తున్న బోరు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

నాగార్జునసాగర్ ఆయకట్టులో ఈ ఖరీఫ్ సీజన్ లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో కనిష్ట స్థాయిలో నీటి మట్టం పడిపోయాయి. ఖరీఫ్ సీజన్ లో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం పోలేనిగూడెంకు చెందిన సైదయ్యకు సాగర్ ఆయకట్టు కింద ఆరు ఎకరాల భూమి ఉంది. తన భూమిలో గతంలో వేసిన బోరులో కొద్దిపాటి నీరు మాత్రమే వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేనప్పటికీ ప్రస్తుతం మోటార్ వేయకుండానే బోరు నుండి నీరు ఉబికి వస్తోంది. దీంతో ఈ వింత ఘటనను చూసేందుకు చుట్టుపక్కల రైతులు ఎగబడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు బోరుబావిని పరిశీలించారు. భూగర్భంలో నీటి పొరలు నిండినపుడు.. ఎక్కడో ఒక దగ్గర నుండి జలాలు ఇలా పైకి ఉబికి వస్తాయని భూగర్భ జల శాఖ అధికారులు తెలిపారు. వీడియో చూడండి…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..