AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చీపురు, తాపీ చేతపట్టిన పెద్దాసుపత్రి సూపరింటిండెంట్.. ఎందుకో తెలుసా..?

అది జిల్లాలోనే అతి పెద్దాసుపత్రి.. రోజు వేలాది మంది రోగులు అక్కడికి వస్తుంటారు. దాదాపు వందల సంఖ్యలో అక్కడ బెడ్స్ ఉంటాయి. కాని పారిశుద్యం మాత్రం ఉండదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటాయి. వైద్యం కోసం వచ్చే వారికి అక్కడి పరిస్థితులు చూస్తే రోగాలు తప్పవన్నట్లు ఉంటాయి.

Andhra Pradesh: చీపురు, తాపీ చేతపట్టిన పెద్దాసుపత్రి సూపరింటిండెంట్.. ఎందుకో తెలుసా..?
Ggh Hospital Superindent Kiran
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 07, 2024 | 2:59 PM

Share

అది జిల్లాలోనే అతి పెద్దాసుపత్రి.. రోజు వేలాది మంది రోగులు అక్కడికి వస్తుంటారు. దాదాపు వందల సంఖ్యలో అక్కడ బెడ్స్ ఉంటాయి. కాని పారిశుద్యం మాత్రం ఉండదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటాయి. వైద్యం కోసం వచ్చే వారికి అక్కడి పరిస్థితులు చూస్తే రోగాలు తప్పవన్నట్లు ఉంటాయి. ఈ మధ్య కాలంలో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి సైతం పారిశుద్యంపై విచారం వ్యక్తం చేశారు. ఇదంతా చూసిన ఆసుపత్రి సూపరింటిండెంట్ పారిశుద్య కార్మికులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా మార్పు రాలేదు. ఇక లాభం లేదు అనుకుని ఆయనే చీపురు చేత పట్టారు. బాత్రూంలు శుభ్రం చేశారు. తాపి చేత పట్టి మరమ్మత్తులు చేశారు. ఇంతకూ ఆయన ఎవరాంటారా.. ఎవరో కాదు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటిండెంట్ కిరణ్..!

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి రోజూ నాలుగైదు వేల మంది ఓపీ రోగులు వస్తుంటారు. ఇప్పటికే 1,500 ఇన్ పెషేంట్ బెడ్స్ ఉన్నాయి. దీంతో ప్రతి రోజూ పదివేల మంది వరకూ ఆసుపత్రి పరిసరాల్లో ఉంటారు. వీరందరి కోసం ప్రతి బ్లాక్ లోనూ టాయిలెట్స్ ఉన్నాయి. అయితే భవనాలు పురాతనం కావడంతో పాటు టాయిలెట్స్ మెయింటినెన్స్ లేకపోవడంతో ధుర్గంధం వెదజల్లుతూ ఉంటాయి. మరోవైపు అతి పెద్ద ఆసుపత్రిలో పారిశుధ్యం లోపం ఎక్కువుగా ఉంటుంది. చెత్త చెదారం పేరుకుపోతుంటుంది. అయితే ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికుల కాంట్రాక్ట్ ఉంది. పదుల సంఖ్యలో కార్మికులు ప్రతి రోజూ పనిచేస్తుంటారు. ఈ కాంట్రాక్ట్ ను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారు. అయితే గత కొంతకాలంగా పారిశుద్య లోపంపై సూపరింటిండెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నా, పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.

కొద్దీ రోజుల క్రితం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసుపత్రిలో సమీక్ష జరిపి, పారిశుధ్య లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు సూపరిండెంట్ కిరణ్ కార్మికులు ఆదేశాలు జారీ చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఆయనే ఏకంగా పారిశుధ్య కార్మికుడు అవతారం ఎత్తారు. అత్యవసర విభాగం వద్ద నున్న బాత్ రూంలో చెత్త పేరుకుపోవడాన్ని గమనించిన ఆయన ఏకంగా చీపురు తీసుకుని శుభ్రం చేశారు. మరోవైపు స్కానింగ్ రూంలో గోడలు పెచ్చులూడిపోతుండటంతో తాపీ తీసుకుని సిమెంట్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన కార్మికులు రంగంలోకి దిగారు. తాము శుభ్రం చేస్తామంటూ ఆయన చేతిలోని చీపురు తీసుకున్నారు.

ఎన్నిసార్లు చెప్పిన కార్మికులు నిర్లక్ష్యం వీడటం లేదని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని సూపరిండెంట్ కిరణ్ చెప్పారు. పారిశుధ్యం లోపిస్తే అనేక రోగాలు వ్యాప్తి చెందుతాయని రోగులు వారితో పాటు వచ్చే సహాయకులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు బాత్ రూమ్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..